రాజకీయాలు

2016 సర్వే ఫలితాలు ఎలా తీసుకోవాలి…

తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబుగారి నాయకత్వంలో బాగా పనిచేస్తుంది. విభజన అనతరం ఉన్నకొద్దిపాటి నిధులతో చంద్రబాబు గారు బండి ఎలాగోలా నెట్టుకొస్తున్నారు అని ప్రజల అభిప్రాయపడటం సంతోషం. అందుకే ఈ దారుణ విభజనకి కారణం అయిన కొంగ్రేస్స్ ను ప్రజలు పరిగణంలోకి కూడా తీసుకోలేదు. ప్రజలు పాజిటివ్ గా చెప్పిన విషయాలు అన్నీ దాదాపు 60 శాతం(మూడిట రెండొంతులు) ఉండటం మంచి పరిణామమే…

  • చంద్రబాబు పైన నమ్మకం.. 53%
  • చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రము కోసం పడే కష్టం, పనితీరు. 51%
  • మత సామరస్యం (లా అండ్ ఆర్డర్ పనితీరు) 61%
  • అన్నీ జిల్లాలు సమంగా అభివృద్ధి…54%
  • ఇచ్చిన హామీలు నేరవేర్చటంలో… 59%
  • నిరంతర విద్యుత్ …

వచ్చే మూడేళ్ళు దీనిని 75% శాతానికి టార్గెట్ పెట్టుకొని పని చేస్తే మంచి ఫలితాలు చూడొచ్చు.

.

మరి ప్రతికూలంశాలు మాటేమిటి…నిస్వార్ధంగా పనిచేస్తూ కూడా మాటలు ఎందుకు పడుతున్నాము. ఒక్కశాతం వ్యతిరేకత ఉన్నా అది మన చేతకానితనమే.

  1. దేశం గర్వించ దగ్గ ప్రభుత్వ పధకాలు ప్రవేశపెట్టినా ప్రజలకు చెరక పోవటం అంటే, అది పార్టీ కార్యవర్గం నిర్జీవంగా తయారు అవ్వటం. అది ఎలాగంటే…

> రైతు రుణమాఫీ

>>రాష్ట్రప్రభుత్వం స్థాయికి మించి ఇచ్చిన రైతు రుణమాఫీ పైన ఎంతమంది అధికారులు, MLAలు, మండలస్థాయి, గ్రామాస్థాయి నాయకులు ప్రజలకు కలిగే ఇబ్బందులను సరిచేస్తున్నారు, వివరించి చెప్తున్నారా? లేదే..ఎందుకని? దీని గురించి MLAకే తెలియదు, తెలిసినా క్రిందివారికి చెప్పాలని పట్టదు, ఇంకేమి పని చేస్తారు..

>నీరు-చెట్టు

>> విచిత్రం ఏమిటి అంటే ఈ పధకం గురించి చాలా మంది కార్యకర్తలకు కూడా అసలు తెలియదు, చెప్పేపని కూడా పార్టీ కార్యవర్గం తీసుకోలేదు. ఈ పధకం కింద చెరువులను తవ్వటం, ఆ మట్టిని కూడా అమ్ముకోటానికి MLAల స్థాయి దిగజారటం (ట్రక్కు మట్టిపై 100 రూపాయలు కమీషన్, దీనికి ప్రోక్లేన్లు సొంత ఖర్చులతో పంపిస్తారు) ఈ పధకం పైన నీలినీడలు కమ్ముకున్నాయి. ఆ నియోజకవర్గంలో మట్టి లేకపోతే ఇసక అమ్ముకోవటం. పక్క రాష్ట్రంలో (క)మీషన్ కాకతీయను కూడా నమ్మిన ప్రజలు ఈ పధకం గురించి తెలియని వైనాన్ని ఎలా జీర్ణించుకోవాలి.

>పించను

>> ఒకటికాదు, రెండుకాదు ఐదు రెట్లు పెంచినా ఏందుకు కొంతమందిలోఇంకా అసంతృప్తి, దీనికి పూర్తిగా గ్రామస్థాయి, వార్డు స్థాయి నాయకులు అలసత్వమే కారణం. వీరితో పనిచేయించుకోవాలని MLAలకి ఉండదు. దీనికి సవాలక్ష కారణాలు. అందులో ముఖ్యమైనది ఒకటి- MROనో, VROనో బదిలీ చేసి పార్టీకి పనిచేసే వారిని నీయమించండి అని MLAలకి అర్జీ పెట్టుకుంటే, ఆ MRO, VROల దగ్గర స్థాయి తగ్గట్టు లంచాలు తీసుకొని వారిని అక్కడే కూర్చోబెట్టిన మహానుభావ MLAలు ఉన్నారు. ఇంకేం పని చెప్పి చేయిస్తారు. గ్రామ, మండల స్థాయి నాయకులకు MROలు, VROలు మాట వినటం మానేశారు. అందుకే రెవిన్యూ శాఖలో అవినీతి మీద పుంఖాలు పుంఖాలు రాసినా ఎవరూ ఏమి చేయలేక పోవటం.

>ఉపాధి హామీ

>> రైతులకు ఉపయోగ పడేలా మార్చినా ఉపయోగం లేకుండా చేస్తున్న వైనం, అధికారులలో పాత వాసనలు పోవు, భయం అంతకన్నా లేదు, MLAల మాట వినాల్సిన పని లేదు అమాత్యులకు తూతూ మంత్రంగా లెక్కలు చెప్పడం చేతులు దులుపు కోవటం, నోక్కేసేది నోక్కేయటం. అంతకు మించి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు తొక్కి పట్టి ఆపటం.

  1. అవినీతి తగ్గకపోవటం పైన ప్రజల అసంతృప్తి…60%

>> విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. ప్రభుత్వ అధికారులతో ముఖ్యమంత్రి వర్యులకు వచ్చిన చిక్కు.  అందుకే మొన్న MLAలతో మీటింగ్ పెట్టి మరీ మీరు తినటం అప్పండి, ఎలాగోలా ఎన్నికలు ఖర్చు పార్టీ బరిస్తుంది అని నెత్తి నోరు బాదుకున్నాడు ఈ పిచ్చోడు (చంద్రబాబు గారు). ఇక్కడ కొస మెరుపు ఏమిటి అంటే ఆ కర్చు కూడా కార్యకర్తలు ఇచ్చే విరాళాల రూపంలో తీసుకుందామని, మేము ఇవ్వటానికి రెడీ నే కాని కొంతమంది లత్తుకోరు MLA దాహార్తి వలన ఇవ్వాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తంది అమాత్యా…

౩. దుబారా ఖర్చు…56%

>> అసలు డబ్బులు లేక ఏడుస్తుంటే దుబార ఖర్చా..? ఏందులో దుబారా ఖర్చు పెడుతుందో సంబంధిత మంత్రులు వివరణ ఇవ్వలేని స్థితి. పక్క దేశం వెళ్ళకుండా పెట్టుబడులు వస్తాయా? ఆకలితో ఉన్న పేదవాడు పండగ పూటైనా కడుపునిండా తింటాడు అని పండగ కానుకలు ఇవ్వటం తప్పా? దీనిని తిప్పికోట్టలేని మంత్రులు ఉంటే ఎంత ఊడితే ఎంత. MLA, MLC ల జీతలపైన ప్రజలలో అసంతృప్తి ఉంది, కాని వీరి దాహం తీర్చటానికి ఇది ఉపయోగ పడితే…పాలన అన్నా గాడిన పడుతుందేమో వేచి చూడాలి.

.

.

మీడియా అంతా హైదరబాదులో ఉండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి గులాంగిరి చేసే పనిలో మనకు వ్యతిరేకంగా మారటం ఒక పక్కైతే, ఆదుకుంటామని మాటిచ్చి నట్టేట ముంచుతున్న కేంద్రం ప్రభుత్వం ఓక పక్కన నలుగుతూ ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వం ఈ మాత్రం నిలదొక్కుకుంటుంది అంటే అది ఆ 64 ఏళ్ళ నిరంతర శ్రామికుడు, సరిసాటిలేని నాయకుడు ఆయన చంద్రబాబు గారి నాయకత్వ పటిమ వల్లనే..

చెప్పేది ఒక్కటే, పార్టీ ప్రజలతో ఉండటం లేదని తేటతెల్లమైంది. కారణం అన్వేషించాల్సిన తరుణం ఆసన్నమైనది. అత్యంత బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ సొంత ప్రభుత్వ పధకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళలేక పోవటం అంటే ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావుగారు (ఎవరి చేతుల్లో ఆ అధికారం ఉంటే వారు) ఆలోచించాలి, భాద్యత తీసుకొని మార్పునకు శ్రీకారం చుడతారని ఆశిస్తూ..

cbn cbn1

Advertisements
Standard