రాజకీయాలు

దేశభక్తులు ఎవరు…?

విశ్వవిధ్యాలయాలు, ఇక్కడనుండి ఎంతో మంది మేధావులు సమాజం లోకి వస్తుంటారు. అందుకే అక్కడ చదువుకునే విద్యార్ధులకు సమాజంలో ఎంతో గౌరవం ఇస్తుంటారు, వారిలో కొందరు నిస్వార్ధ రాజకీయ నాయకులుగా ఎదిగి దేశానికి సేవ చేసినవారూ ఉన్నారు. గౌరవప్రదమైన భాధ్యతాయుతమైన స్థానాల్లో దేశ సేవ చేసినవారు ఎందరో, వారందరికీ నా పాదాభివందనాలు.

అలంటి ఉన్నతమైన వేదిక అయిన విశ్వవిధ్యాలయాలలో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?

విశ్వవిధ్యాలయాలల్లో విద్యార్ధి సంఘాలు ఉంటాయి, వాటి సిద్ధాంతాలు నచ్చిన విధ్యార్ధులు అందరూ కలిసి వారికి కావాల్సిన సౌకర్యాలపై, సమాజంలో జరుగుతున్న అసమానతలు పై వారి గళం విప్పటం సహజం. రాజకీయ నిరుద్యోగులు, అధికార పార్టీ నాయక గణం వీరిరువురు విశ్వవిధ్యాలయాల విద్యార్ధి సంఘాలలో వేలు పెట్టి వారిని రచ్చకీడ్చి దేశ ద్రోహులుగా చిత్రీకరించటం జరుగుతుంది, సమాజానికి ఇది శ్రేయస్కరం కాదు.

మనకి అధికార పార్టీ నాయక గణం అంటే తెలుసు అసలు రాజకీయ నిరుద్యోగులు అంటే ఎవరు? ప్రజల మద్దత్తు ద్వార గెలవని వారు, గెలవలేని వారు, అధికార పార్టీని రాజకీయంగా ఎదుర్కోనలేని వారు, సమాజాన్ని మొత్తంగా చూడలేక ఒక చిన్న సమూహానికి మాత్రమే వకాల్తా పుచ్చుకునే వారు, వీరందరికీ సహన భావ శీలత్వం బాగా తక్కువ.

సహజంగా అధికార పార్టీ అనుబంధంగా పని చేసే విద్యార్ధి సంఘం కార్యకలాపాలు క్కువగా చేస్తుంటారు, అది మిగతా సంఘాల వారికి కొంచం ఇబ్బందిగా ఉంటుంది, అందునా హిందుత్వ ఏజండాతో పని చేసే భాజాపా అధికారంలో ఉన్నప్పుడు వారి అనుబంధ విద్యార్ధి సంఘం ABVP కార్యకలాపాలు మిగిలినవారికి సహజంగానే కొంచం ఎక్కువ కంటగిoపుగా ఉంటాయి. ఇప్పడు ABVP ఒకవైపు మిగిలిన సంఘాలు SFI, AISF, ASA ఇలాంటి ఒక వైపుగా చలామణి అవుతున్నాయి. వీరికి దళిత ముసుగు వేసి రాజకీయ నిరుద్యోగులు ప్రత్యక్షంగా అధికార పార్టీని ఎదుర్కొనలేక వీరిని ఉసిగోల్పుతుంటారు. విశ్వవిధ్యాలయాలలోని విద్యార్ధి సంఘాల వారి పనిని వారు  చేసుకోనీయకుండా వారి పనిలో ఎప్పుడైతే ఈ రాజకీయ నిరుద్యోగులు, అధికార పార్టీ వారు తమ పెత్తనం చేయలనుకుంటారో అప్పుడు ఇలాంటి పరిణామాలు చూడవలసి ఉంటుంది.

నిన్న HCU దగ్గర నుండి నేటి JNU దాక జరుగుతున్న పరిణామాలు అక్షేపనీయం, వింత ఏమిటి అంటే ఇరు వైపులా పరిపక్వత లేని జ్ఞానంతో రచ్చ కెక్కి విశ్వవిధ్యాలయాల పరువు, దేశ పరువు మంట గలుపుతున్నారు. ABVP ఒక వైపు, మిగిలిన వైరి వర్గం ఒక వైపు మొహరించి దీనికి ఎప్పుడో కాలం చెల్లిన బ్రాహ్మణ – దళిత అసమానతలు ప్రస్తావిస్తూ ఒకరిని ఒకరు రెచ్చగోట్టుకుంటూ ఉంటారు, ఈ అగ్నికి వాయువు తోడన్నట్టుగా అధికార, రాజకీయ నిరుద్యోగులు మరో వైపు.

వీరి రచ్చ భారతదేశపు అత్యధికులు పూజించబడే ఆవుని వదించటం, ఆవు మాంసం తినటం నిషేధంతో మొదలైంది. బాహాటంగా దానిని వ్యతిరేకించటం చేతకాని రాజకీయ పార్టీలు అపర మేదో సంపత్తి గలిగిన మేధావులను, విద్యార్ధులను, వారి సంఘాలను  ఉసిగొల్పి రచ్చ మొదలు పెట్టాయి. ఇలా చేస్తుంటే అధికార పార్టీ ఊరకనే ఉంటుందా వారు వారి సంకుచిత స్వభావాలు వారి అనుబంధ సంఘాలపై రుద్దారు. స్వతహాగా ప్రతి విషయాన్ని త్వరగా స్పందించే విద్యార్ధి సంఘాలు అలానే కొంచం కూడా ఆలోచించకుండా కదన రంగంలోకి దూకి నేడు అభాసు పాలయ్యారు, పాలవుతున్నారు. మాకు మా అంబేద్కర్ రచించిన రాజ్యాంగలో స్వేచ ఇచ్చారు కాబట్టి మీరు చెప్పినట్టు మేము వినేది ఏంది అని ఓక వర్గం, ఆ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోటి అధికారంలోకి వచ్చినదే ఈ ప్రభుత్వం అనే ఇంగితం మరిచిపోయారు ఓక వర్గం. ఈ దేశ ప్రజల మనోభావాలను కించ పరుస్తారా అంటూ వారిని దేశద్రోహులుగా చిత్రీకరించటం, అదే దేశ ప్రజల్లో వీరు కూడా ఒకళ్ళు అనే ఇంగితం వీరు మరిచిపోయారు.

ఇంట్లో అమ్మ చీర కషాయం రంగులో కనపడినా కాల్చి పారేస్తాను అనే ఒక సంకుచిత స్వభావంగల ఓ పిరికివాడు ఆత్మహత్య చేసుకొని తన వర్గానికి పిరికితనం ఆపాదించి తప్పు చేస్తే అసలు జరిగిన విషయం పక్కన పెట్టి రాజకీయ స్వలాభాల కోసం పాకులాడే రాహుల్ గాంధి, కేజ్రివాల్, కమ్యునిష్ట్ నాయకులూ, కొందరు రాజకీయ నిరుద్యోగులు చేసింది ఎంత తప్పో. అసలు తోటి విద్యార్ధి ఆత్మహత్య చేసుకుంటే అతడి కుల దృవీకరణ పత్రం అవినీతి మీద ప్రచారం చేయటం తప్పించి అందుకు గల కారణాలు విశ్లేషించుకొనే తత్వం అలవర్చుకొని అధికార సంఘానిదీ అంతే తప్పు. తెగబలిసి ఒకరు ఉగ్రవాది యాకోబ్ మీనన్ ఉరి వొద్దని, ఒక యాకూబ్  మీనన్ పోతే ప్రతి ఇంట్లో ఒక యకోబ్ మీనన్ పుడతాడు అంటారు, ఇదే అదును అని అలా మాట్లాడిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించి రాజకీయం తెరలేపే వారు ఇంకొకరు. దీనికి దళిత కార్డు తగిలించి రాజకీయంగా చలి కాచుకునే హేయమైన చర్య తప్పించి, వీరిరువురు చేస్తున్నది ఏమిటి?

ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేశభక్తిని ఎవరూ తప్పుబట్టలేరు, కాని ఒకడు JNUలో భారత దేశాన్ని విచ్చిన్నం చేస్తాం అని నినదిస్తుంటే పక్కనే నుంచొని దానిని ఖండించకుండా ఆజ్యం పోసిన కన్నయ్యది ఎంత తప్పో, అన్న వాడిని మక్కెలిరగ తీయకుండా పక్కోడి మీద కేసు పెట్టిన అధికార పార్టీది అంతే తప్పు. రాజ్యంగబద్దంగా న్యాయ విచారణ చేసి ఉరి వేసిన ఒక తీవ్రవాదిని కీర్తించే హక్కు ఈ విద్యార్ధులకి ఎవరిచ్చారు? మీ అనుభంద సంస్థల నాయకులని ఇంట్లో కోర్చోబెట్టిన జనం సొమ్ముతో చదువులు వెలగబెట్టే మీరు ఆ జనానికి జవాబుదారిగా ఉండాలి కాని ఈ కాంగ్రెస్స్ రాహుల్ గాంధీకి, కేజ్రివాల్ కి, కుర్తా పైజమా ధరించి అపర మేధావులుగా చలామణి అయ్యే కమ్యునిస్టు నాయకులకి కాదు, వారు ప్రజలకు జవాబు చెప్పలేని స్థితిలో ఉండి, మిమ్మల్నిఉసిగోల్పటం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి.

భారతదేశ సార్వభౌమాధికారాన్ని విచ్చిన్నo చేసేలా రాజదాని నది బొడ్డులో నిలబడి నినదిoచితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? విద్యార్ధులు కదా అని చూస్తూ ఊరుకుంటే రేపు ఇంకో గొట్టంగాడు నది రోడ్డులో భారత దేశ పతక్కన్ని తగుల బెడితే చూస్తూ ఊరుకోని కూర్చోవాల్సిందే గా? కన్నయ్య ను అరెస్ట్ చేసేసరికి అతడు ఒక దళిత విద్యార్ధి అని అందరికీ గుర్తుకు వచ్చిందే, మరి అదే దళిత విద్యార్థి పక్కనే చోద్యం చూస్తూ ఉన్నప్పుడు అతను చేసింది తప్పు అని ఎందుకు అనలేక పోతున్నారు? అయ్యా మేధావులారా, వారిరువురు చేసింది తప్పే కాని మీరు ఒక వైపునే మాట్లాడటం ఆపండి. పక్కనే ఉండి ఖండించాల్సిన కన్నయ్య అలా చేయకుండా ఉండటాన్ని ఖండించరు. ఎమన్నా అంటే అవన్నీ మాకు అవసరం లేదు అని కన్నయ ప్రసంగాన్ని మాత్రం ప్రచారం చేస్తారు. కాశ్మీర్లో తీవ్రవాదులను బలపరిచే వారితో కలిసి అధికారం చేలాయిస్తూ ఇక్కడ మిగతావారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించే అధికార పార్టీది అంతే ఘాతుకం. మీరు చేస్తే దేశభక్తి పక్కవాడు చేస్తే దేశ ద్రోహమా? అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నిరుద్యోగులూ మీ నిస్సిగ్గు జడత్వాన్ని మా పైన రుద్దకండి. మాకు తెలుసు మీ వేషాలు.

అంటే “విశ్వవిద్యాలయాల్లోని విద్యార్ధులకు రాజకీయాలు అనవసరo” అంటే  దానికి నేను వ్యతిరేకం.

దేశ నలుమూలనుండి ఈ విశ్వవిధ్యాలయాల్లో చదువుకోటానికి వచ్చిన ఎంతో మంది మన సమాజం స్థితిగతులను సంపూర్ణంగా అర్ధం చేసుకొని కొందరు ఉన్నత అధికారులుగా, కొందరు నిస్వార్ధ రాజకీయ నాయకులుగా, కొందరు సమాజసేవా తత్పరులుగా, పలు రంగాలలో దేశానికి సేవ చేస్తుంటారు. వీరందరి బయటకు వచ్చిన తరువాత వారి ఎంచుకున్న రంగాలు చేసే పనులు వేరైనా వాటి ఫలితాల్లో మాత్రం సంబందాలు ఉంటాయి. అందుకే వారు అన్నీ నేర్చుకోవాలి, అన్నీ రంగాల్లో ఉండాలని కోరుకుంటాను. వీరి చర్యల వల్ల 80 శాతం పైగా మధ్యే మార్గంగా జీవించే ఈ దేశ ప్రజలు నలిగిపోతున్నారు. వారిలో ఒకడిగా నా మానసిక సంఘర్షణే ఈ వ్యాసం అంతే గాని ఎవరినీ నొప్పించాటానికి కాదని మీ హర్ష.

Advertisements
Standard