రాజకీయాలు

మన అమరావతి: మన రాజధాని శంకుస్థాపన.

“అమరావతి” ధాన్యకటకంగా, ధరణికోటగా పలు పేర్లతో పిలవబడి ఎంతో ఘన చరిత్ర కలిగిన మన అమరావతి నేడు మళ్ళీ భవిష్యత్తులో చరిత్రని తిరగారేసేందుకు మొదటి అడుగుకు సంసిద్ధమవుతుంది. చరిత్రలో అమరావతి శిధిలావస్థకు చేరిన ప్రతి సారి ఎవరో ఒక రూపంలో మరలా నిలబెట్టి మనకు ఆ ఘన చరిత్రను అందచేసారూ. అలా మనకు 18వ శతాబ్దపు చింతపల్లి సంస్ధానీసులు శ్రీ రాజా వెంకటాద్రి నాయుడు శిధిలావస్థకు చేరిన అమరావతిని పునఃప్రతిష్టించి దీనినే రాజధానిగా మార్చి పాలన సాగించి ఆ ఘనచరిత్రను మనకు అందజేస్తే ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబునాయుడి సహకారంతో భావితరాలకు అందించే అవకాశం కలగటం ఎన్నో జన్మల పుణ్యం. ఇంతటి పుణ్యకార్యంతో సగర్వంగా తలెత్తుకొని నిలబడేందుకు సమాయుత్తమవుతున్నవేళ ప్రతి ఆంధ్రుడి గుండె ఉద్విగ్న భరితమవుతున్నది. పడిలేచిన కెరటంలా భవిష్యత్తులో మరలా సువర్ణాక్షరలతో లిఖించబోయే సమయం. వారిని హేళన చేసినా, వారిని కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకు లాగినా, వారి ఆత్మగౌరవాన్ని పెట్టుబడిగా పెట్టి పిడికిలి బిగించి నిలబడుతున్న సమయం. ప్రపంచమే తెలుగువారి తెగువకు అబ్బురపడే క్షణాన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాభినందనలు తెలియచేస్తూ… ఒక్క పిలుపుతో వారి ప్రాణ సమానమైన 33వేల ఎకరాలు భూములను ప్రభుత్వానికి అప్పగించిన ఆ ప్రాంతపు రైతులకు వారి కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు చేస్తున్నాను. మీ త్యాగం విలువకట్టలేనిది, మరువలేరు ఈ రాష్ట్ర ప్రజలు.

ఇటువంటి సమయాన రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు ఎంతో బాధని, కోపాన్ని రగుల్చుతున్నాయి. అసలు ఎమాత్రం ఆంధ్రుల మీద గౌరవం చూపకుండా కనీసం వారి గోడు వినకుండా ఇష్టారాజ్యంగా వారి ప్రజా ప్రతినిధులని తలుపులు మూసి, కొట్టి, వేరు చేసి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని నడి రోడ్డు మీద పడేసిన ఈ కాంగ్రేసు పార్టీ వారు నేడు నిస్సుగ్గుగా మాట్లాడుతున్నారు. అరె ఉరి వేసేముందు కూడా ఓసారి అడుగుతారే అలాంటిది కనీసం ఒక్క మారు ఇలా చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోతారు వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అనే సోయ లేకుండా మీ కడుపు మంటను చల్లార్చుకున్నారే. ఇంత చేసి, నిర్లజ్జగా మరలా మాటలా? ఇప్పుడు ఎంతో గౌరవంతో పండుగులా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి శంకుస్థాపన చేసుకుంటుంటే వచ్చి చెంపలేసుకొని క్షమాపణ చెప్పుకోవాల్సింది పోయి భాహిష్కరిస్తారా? మీకు అసలు సిగ్గు-లజ్జా లాంటివి ఎమన్నా ఉన్నాయా? ఛీ..ఎంత దౌర్భాగ్యం…

రాష్ట్రానికి ఎంతో అవసరమైన రాజధాని శంకుస్థాపన జరిగే సమయంలో సర్కారు ఎక్కడా తప్పు చేయకుండా కాపలా కుక్కలా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అసలు పండుగలో భాగం పంచుకోను అనటం అతని కడుపు మంటకు నిదర్సనం. ఎవరి మీద నీ కడుపు మంట? ఈ రాష్ట్ర ప్రజల మీదనా? నీకు రాజధాని విషయంలో ఎమన్నా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే సందర్భాలు, వేదికలు చాలా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టి కడిగే హక్కు నీకే ఉంది, అలా చేయకుండా భాహిష్కరించటం ఏంటి? ప్రజల పండుగను కాదనటానికి నీకేమి హక్కు ఉంది? రాజధానికి వ్యతిరేకం కాదు అంటావు మరలా విషం కక్కుతావు. ఈ పనికి నువ్వు, నీ పార్టీ పనికిరారనే కదా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది. ప్రజా తీర్పుని గౌరవించరు, ప్రజల అవసరాల్ని పట్టించుకోరు, ప్రజా అభిమతంతో మీకు పని లేదు, మీ ఒంటెద్దు పోకడలు మీవి, మీ రంది మీది. ఎందుకు రావటంలేదో అంటూ విషయం లేని ఓ పనికిమాలిన లేఖ, దానిలో రాసిని ఒక్కటన్నా సహేతుకమైన ప్రశ్న ఉందా? మీ నికృష్ట జీవిత చరిత్ర ని ఒకసారి తిరగేస్తే నువ్వు అడిగిన ప్రశ్నలకు నీకే సమాధానం దొరుకుతుంది. కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా వీడు పనికి రాడు అని ప్రజలకు తెలియచేయటానికి కాకపోతే ఏందీ ఈ పనికిమాలిన పనులు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రేమను, మనసులు గెలుచుకోవాలంటే పాతాళానికి తొక్కబడిన వారి భవిష్యత్తును, జీవితాలని గాడిలో పెట్టేవారికి చేదోడుగా ఉంటూ మీ రాజకీయ అవసారాలు చూసుకోవాలి తప్పించి ఇలా ప్రజల ఆశల మీద మీ కడుపు మంటను రుద్దితే మిమ్మల్ని అధఃపాతాళానికి ప్రజలు తొక్కేస్తారు. ప్రజలను గొర్రెల్లాగా చూడటం మానేసి మనుషుల్లాగా చూసి గౌరవించడం నేర్చుకుంటే మంచిది ఈ రెండు పార్టీలు. ఈ విషయంతో తల్లి-పిల్ల కాంగ్రేసులు ఒకటే అని మరోసారి నిరూపితం అయ్యాయి. ఆ విషయం ప్రజలకు కూడా అర్ధం అయింది. అది చేతల్లోకి తెచ్చుకునేదాక లాగొద్దు అనేది నా మనవి.

మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు… మన అమరావతి శంకుస్థాపన సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ… మీ శ్రీ హర్ష

Advertisements
Standard