రాజకీయాలు

హీరోలు – అభిమానులు

లనచిత్ర రంగం, ఒక రంగుల లోకం. సుప్రసిద్ధ నటులను మనకు పరిచయం చేసిన ఒక రంగం. ఈ రంగం ఇప్పుడు “పరిశ్రమ” గా మారి చలనచిత్ర పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఈ పరిశ్రమ బయటనుండి ఒక అధ్యితీమైన సువర్ణ సుందర స్వప్న లోకం, కాని మనకు తెలియని ఎన్నో ఆకలి దప్పుల కష్టాలు, కర్కోటక శ్రమ దోపిడి, నిస్సుగ్గు స్వార్ద అవకాశవాదం, మనుషులను మనుషులు గా గుర్తించని ఒక విచిత్ర లోకం. లక్షణ, అవలక్షన గుణాల సామూహిక సమ్మోహన ప్రపంచం.

“మానవ సంభందాలు అన్నీ ఆర్దిక సంభందాలే” అని కార్ల్ మార్క్స్ అన్నట్టు మన నిజ జీవితంలో ఎలాగైతే ఆప్యాతలు ప్రేమలు తగ్గి వ్యాపారాత్మక విలువలు పెరిగాయో అలాగే ఈ పరిశ్రమలో కూడా అంత కంటే ఎక్కువగానే వ్యాపారంగా మారిపోయింది. తెలుగు సినీ కళామతల్లి అని నిస్వార్ధంగా పిలిచుకునే కొంతం మంది “అభాగ్యులు” తప్పించి మిగిలిన అందరూ వ్యాపారులే. నాకు తెలిసిన అంత వరకు NTR – ANRల నటించిన కాలంతోటే కళని తల్లిగా చూసుకునే రోజులు పోయాయి, ఆ తరువాత వచ్చిన వారందరిలో వ్యాపారాత్మక ధోరణితో వచ్చిన వారే ఎక్కువ. అందుకు ఉదాహరణ పూర్వం నటించడం అనే కళని నాటక రంగం ద్వారా నటీ నటులు ఆ రంగాన్ని పోషించేవారు. కాని ఇప్పుడు  నటీనటులను చలనచిత్ర రంగం పోషించాల్సి వస్తుంది అందుకే కాబోలు ఇది చలచిత్ర పరిశ్రమగా రూపాంతరం చెందింది. పూర్వం నాటకాల ద్వార ప్రజలకు వినోదం పంచేవారు అదే మాధ్యమాన్ని ఉపయోగించి ఎంతో మంది మహానుభావులు ప్రగతిశీల భావాలను ప్రజలకు అతి సులువుగా ఎంతో ప్రభావితంగా విషయాన్నీ అర్ధం అయ్యేలాగా చెప్పి జాగుర పరిచే వారు. ఎప్పుడు అయితే సినిమా రంగం వ్యాపారత్మక ఆలోచనలు పురుడు పోసుకున్నాయో అది పూర్తిగా వినోదం పంచే మాధ్యమంగా తయారైంది. మన తెలుగు చిత్ర సీమలో ఉన్న హీరోలు కావొచ్చు దర్శకులు కావొచ్చు వారి వారసులు ఎవరైనా కాని నిర్మాతనుండి నిర్మొహమాటంగా ముక్కు పిండి వసూలు చేసేవారే గాని ఇబ్బందులు వచ్చినవి సదరు నిర్మాతను లేక డిస్త్రిబ్యుటర్లను ఆదుకున్దామనే ధ్యాసే లేనప్పుడు వీరిని ఎ రకంగా గౌరవంగా చూడగలరు సామాన్యులు. ఆ సామాన్యుల్లో నేను ఒకడిగా ఇది రాస్తున్నాను.

ఒక హీరో తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటారు. ఆ అభిమానానికి చాల కొలబద్దలు వాటిల్లో నటన, ఆహార్యం, నిబద్దత, క్రమశిక్షణ, సేవా గుణం లాంటి వాటితో పాటు కులం అనే దౌర్భాగ్యపు కొలబద్ద ఒకటి ఎక్కువగా మన పరిశ్రమలో వుంది. ఈ దౌర్భాగ్యపు (కుల) అభిమానులు వాళ్ళ ఆ హీరోలకు మంచి పేరు కంటే చెడ్డ పేరు వచ్చిన దాకలాలే ఎక్కువ ఎందుకంటే పిచ్చి బ్రమల్లో ఆ హీరోలను విహరిమ్పచేస్తారు. ఈ కుల పిచ్చితో రాజకీయాల్లోకి వచ్చి చావు దెబ్బ తిన్న హీరోలు లేక పోలేదు. ఇలాంటి కుల పిచ్చి అభిమానులు వారి సంఘాల వలన చిత్ర పరిశ్రమలో అందరివాడుగా వున్న హీరోలు రాజకీయరంగంలో కొందరివాడిగా అయిపోయారు. పరిపక్వత లేని కొంతమంది హీరోలు రాజకీయాల్లో వేసే తప్పటడుగులు వలన ప్రజాజీవన ప్రయాణాలను ఒడిదుడుకులు గురయ్యాయి. అలంటి వాటిల్లో ఒకటి మన రాష్ట్రంలో మెగాస్టార్ గా పిలబడే చిరంజీవి అనే నటుడు చేసిన ఒక తప్పటడుగు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలనే సమూలంగా మార్చివేసిన ఘటన. పార్టీ పెట్టటం అంటే సినిమా రికార్డులు తిరగ రాయటం లాంటిదే అనే బ్రమతో ప్రజల జీవితాలతో ఆడుకునే అధికారం నిస్సందేహంగా ఈ కుల అభిమానులు కలిగించినదే. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ని స్థాపించిన 9నెలలో పార్టీ ని అధికారంలోకి తెచ్చిన ఘనత (సినిమా పరిభాషలో రికార్డు) ని తిరగ రాయాలనే ఉద్దేశం కావొచ్చు, మరేదైనా కావొచ్చు పార్టీ పెట్టిన దగ్గరనుండి అన్నీ అలంటి బ్రమల చుట్టే తిరిగారు, కాస్తో కూస్తో సమాజం పట్ల ఆ సమాజంలో బ్రతికే ప్రజల జీవితాల పట్ల అవగాహన వున్న పవన్ కళ్యాణ్ సహజంగానే అన్నకు మద్దత్తు తెలిపారు. కాని ఎన్నిక ఫలితాలు వచ్చేదాకా అర్ధం కాలేదు మహామేత ఆడిన నాటకంలో పావు అయ్యాడని. అంతటితో ఆ ప్రజాజీవన విధ్వంసం ఆపకుండా పార్టీ పెట్టేటప్పుడు ప్రకటించిన భావాలు, విధి విధానాలు గాలికి వొదిలి, రక్తాన్ని దారపోసి పార్టీని నడిపిన అభిమానులను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. తమ్ముళ్ళు వ్యతిరేకించినా వినలా, నిజమైన అభిమానులు వద్దన్నా వినలా, సామజిక సలహాదారులు చెప్పింది చెవికి ఎక్కిన్చుకోకుండా తెలుగు ప్రజల జీవితాల్ని ఢిల్లీ సోనియా కాళ్ళ దగ్గర పడేసాడు. ఆ బలంతో మదమెక్కి ఇష్టానుసారంగా దారి తెన్నూ లేకుండా తెలుగు రాష్ట్రాన్ని విభజన చేసింది. విభజన తప్పు కాదు అది చేసిన విధానమే అత్యంత దారుణం అని ప్రజలు నెత్తినోరు బాదుకున్నా ఈయనగారికి వినపడలా. ఈ దౌర్భాగ్యపు ఘటనలో కూడా ఈయనగారు ఢిల్లీ మేడం రాసిన ఉత్తరాన్నే సభలో చదివి డం డం లాడించారు. అసలు వీరికంటూ ఒక ఆలోచన లేదా, వీరి అపరిపక్వ నిర్ణయాల ద్వారా ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు. అందుకే కాబోలు ప్రజలు ఆ పార్టీకి ఆంద్ర రాష్ట్ర చట్ట సభల్లో అసలు ప్రాధాన్యతే లేకుండా చేసారు. ఎన్నిలప్పుడు పురుడు పోసుకున్న ఒక తోక పార్టీ చీరాల ప్రజా సమితి కి అన్నా ఒక సీటు వచ్చింది కాని 125 చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునే చిరంజీవి గారికి ఒక్క సీటు కూడా లేకుండా చేసారు ప్రజలు. ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం వీరికి ఎలాగైతే ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కును బలవంతంగా అయినా  లాగేసుకునే హక్కు కలిగించిందో అలాగే ప్రజలుకు కూడా వీరు చేసే పనికి మాలిన పనులను, పనికి మాలిన చేష్టలను, పనికి మాలిన మాటలను ఎండగట్టే హక్కు కల్పించింది. కాబట్టి ఇలాంటి హీరోలను కులం నేపధ్యంలో నెత్తిన ఎక్కించుకునే అభిమానులకు ఒక విజ్ఞప్తి ప్రజలు అడిగే ప్రశ్నలకు దమ్ముంటే వివరించాలి గాని గుడ్డిగా వ్యతిరేకించడం అవివేకం అవుతుంది. ఇకనైనా ఈ నాయకులూ ప్రజలకనుకూలంగా నడిచి వివేకం ప్రదర్శిస్తారనుకున్దాం, ఇది సదరు రాజకీయ నాయకుడుగా ఎదిగిన ఏ హీరోకైనా వర్తిస్తుంది చిరంజీవి కావొచ్చు, బాలకృష్ణ కావొచ్చు, పవన్ కళ్యాణ్ కావొచ్చు ఎవరైనా ఓళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల మనోభావాలు గురుతెరిగి ప్రవర్తించాల్సిందే.

మేము వీరి సినిమాలను వ్యతిరేకించడం లేదు; ప్రజల ఆర్ధిక, సామజిక హక్కులకు సంబంధించిన విషయాల్లో వీరి నిర్ణయాలను తప్పు బడతున్నాము. అది ప్రజాస్వామ్యం మాకు కల్పించిన హక్కు. చిరంజీవి రేపు కాళీగా వుండి 150వ సినిమా చేస్తే నేను కూడా చూస్తాను అది వేరే విషయం ఎందుకంటే అది “సినిమా” ఇది “రాజకీయం”. రెండూ వేరు.

Advertisements
Standard