రాజకీయాలు

ఒక సామాన్యుడి ప్రశ్న…

“ఆంధ్రప్రదేశ్” ఎందరో త్యాగధనుల త్యాగ ఫలంతో తెలుగువారికోసం ఏర్పడిన తెలుగు రాష్ట్రం. తెలుగు వారు అంటే గొప్ప చరిత్ర కలిగినవారుగా, తెలివైన వారిగా అంతకన్నా గొప్ప ఆత్మాభిమానం కలిగిన వారుగా ప్రపంచ పటంలోనే ఒక అనిర్వచనీయమైన గుర్తింపు. కాని ఇప్పుడు అది గతం…. అని తలచుకుంటేనే కకావికలమైన మనసులో ఏదో తెలియని అలజడి ఎగదన్ని… అది కళ్ళల్లోనుంచి సుడులు తిరుగుతూ బయటకు వచ్చే కన్నీటి వలన అస్పష్టంగా కనిపించే తెలుగు వారి భవిష్యత్తు గురించి నా మస్థిష్కంలో ఉదయించిన కొన్ని ప్రశ్నలకు రాజనీతుజ్ఞులు గాని , స్వయం ప్రేరేపిత ఉద్యమ కారులుగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని, తెలుగువారంటే ఒక్క సీమంధ్ర ప్రాంతం వారే అని గిరి గీసే రాజకీయ పార్టీలు గాని, వాటి అధ్యక్షులు గాని, ఆ పార్టీ నాయకులు గాని, ఎటువంటి పార్టీతో సంబంధం లేదని చీకటి పడగానే పార్టీ పక్కల్లో దూరే మేధావులు గాని ఎవరైనా ఈ సామాన్యుడి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంతో కొంత సమాజం పట్ల అంకిత భావం వున్నది అని నిరూపించండి.

నాకు తెలిసిన చరిత్ర చెప్పినా పట్టించుకోరు, ఎందుకంటే సామాన్యుడిని కదా… అత్యంత తెలివైన వారు రాజకీయ నాయకులు కాబట్టి పెద్దగా చరిత్రలోకి వెల్ల దలచుకోలేదు. దాదాపు ఓక పుష్కర కాలం కిందట, తెలుగువారు నలుదిక్కులా పయనిస్తూ వారి కీర్తిని ఖండాంతరాలు దాటిస్తూ ఒక వెలుగు వెలుగుతూ తల ఎత్తుకొని సగర్వంగా ప్రపంచాన నిలబడిన రోజులు అవి.

ఒక తాగుబోతు వ్యక్తి మంత్రి పదవి రాలేదని ఒక ప్రాంతంలోని తెలుగువారిని తన మాటల గారడితో నిజాల్ని పాతరేసి అబద్ధాలని చెప్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం నమ్మించే ప్రయత్నం మొదలెట్టాడు, దానికి ఉద్యమాల పురిటిగడ్డ అయిన తెలంగాణా ప్రజలు అంతగా నమ్మక పోతుంటే, ఒక మహా అవినీతి రాజనీచజ్ఞుడు దానికి రాజకీయ రంగు పులిమి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని రాష్ట్రపతికి లేఖ ఇప్పించి విభజనకి రాజకీయ రంగు పులిమారు, ఆ బృందానికి అధ్యక్షత వహించిన కడప నేత ఇప్పుడు సమైఖ్య వాది…కర్మ కాకపోతే ఎంటండి. అది కేవలం రాష్ట్రంలో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడుని ఎదుర్కోటానికి వీరిద్దరూ కలిసి అత్యంత దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగం, వారి భవిష్యత్తు కోసం తెలుగువారి భవిష్యత్తుని నాశనం చేసిన నీచులు. అవునా?… కాదా? (అందుకే ఒకడు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసి పావురాల గుట్టలో తెగి పడిన సగం కాలిన అవయవాలతో అత్యంత నీచంగా పరమపదించాడు)

అలా 2003 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహా అవినీతి రాజనీచజ్ఞుడు వేర్పాటు వాదులను ప్రభుత్వంలోకి తీసుకొని దుర్మార్గంగా పాలించటం మొదలుపెట్టాక కాని సదరు ఫారం హౌస్ పార్టికి అర్ధం కాలేదు ఆ రాజనీచజ్ఞుడు తెలంగాణాలోని భూములను ఎలా దోచుకున్టున్నాడో అని. పనిలో పని వీరికి కూడా కొంత గడ్డి వేసాడులెండి, అందుకే మాట్లాడారు. ఇలా ఆ రాజనీచుడి పాలనలో జరిగిన అవినీతిని చూసిన తెలంగాణా ప్రజలు అప్పుటినుండి తెలంగాణకు సీమంధ్ర నాయకులు ద్రోహం చేస్తున్నారని నమ్మటం మొదలెట్టారు, ఉద్యమించారు. అవునా?… కదా?

తెలంగాణాలో పటేల్ పట్వారి వ్యవస్థలను ఒక్క కలం పోటుతో రద్దు చేసింది, బడుగు బలహీన వర్గాలను అందునా మాదిగలను, కల్లు గీత కార్మికులను, పెత్తందారులనుండి విముక్తి చేసి రాజకీయాలను వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసింది, ఆంధ్రుల హైదరాబాద్ ను ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి చేసింది ఒక్క తెలుగుదేశమే. ఆ విషయాలు చంద్రబాబు ఎంత చెప్పినా ఆ రాజనీచుడి అవినీతి ముందు అరణ్య రోదన అయ్యింది. సాటి తెలుగు వారిని ఉద్యమాల పేరుతో ఫార్మ్ హౌస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తప్పుడు మాటలు విని అసువులు బాసిన ఎందరో తెలంగాణా అభాగ్యులను చూసి మనసులో ఇష్టం లేక పోయిన తెలంగాణా ప్రాంతపు నాయకుల మరియు ప్రజల అభిప్రాయాలను గౌరవించి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ నీచ బుద్ధి తెలుసు కాబట్టి  ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన విభజన చేస్తేనే తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలం అని కూడా రాసిన పోలిటబ్యూరో లేఖపైన సంతకం చేసాడు దానికి ఇప్పటికీ కట్టుబడే వున్నాడు. అవునా?… కాదా?

2009 లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న ఫార్మ్ హౌస్ పార్టీ తాగుబోతు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై పొత్తులో భాగంగా బలహీన అభ్యర్ధులను పెట్టి లోపాయికారిగా కాంగ్రెస్ పార్టీకి సహకరించి తెలంగాణాను మరితగా ఎడారిని చేసారు. నిలువెత్తు సాక్ష్యం డబ్బు తీసుకొని నిజామాబాదులో డి.శ్రీనివాస్ మీద బలహీన మైన అభ్యర్ధి పెట్టారు అది తెలిసి అక్కడ ప్రజలే BJP అభ్యర్ధిని గెలిపించారు. అవునా?… కదా?

శవం పక్కన వుంచుకొని ముఖ్యమంత్రి పదవి కోసం చనిపోయిన తండ్రిని చూడటానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రిని అడిగిన ఒక వ్యక్తి అధికార దాహం చూసి అవాక్కయి, కాదనిన ఆమె మీదే తిరుభాటు చేసి కడప పౌరుషానికి ఢిల్లీ పెత్తనానికి యుద్ధం అన్న దొంగబ్బాయి..గజన్ తన తండ్రి సమాధి సాక్షిగా తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తాం అని చెప్పి, జైలు నుండి బయటకు రావటానికి సోనియా కాళ్ళు పట్టుకొని తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అదఃపాతాళానికి తోక్కేసి, అదే కాంగ్రేస్స్ ఆడినట్టు ఆడుతూ ఒకసారి సమన్యాయం అని, తెలంగాణాలో దుకాణం కట్టేసి ఆ తరువాత సమైఖ్యాంధ్ర  అని, ప్రజల్ని మోసం చేస్తుంది అవినీతి ycp పార్టీ. అవునా?… కాదా?అయ్యా కాంగ్రెస్ నాయకులారా తెలంగాణాకి వ్యతిరేకంగా పార్టీలో మీకు తెలియకుండా మీ పార్టీ నిర్ణయం తీసుకుందంటే నమ్మటానికి జనాలు ఎమ్మన్నా వెర్రి వెధవల్లగా కనపడుతున్నారా?

 • విభజన పైన కాంగ్రెస్ అంటోనీ కమిటీ వేసింది అన్నారు అది సోదిలో కూడా లేదు!
 • ఆ తరువాత అంటోనీ కమిటీ నివేదిక లేకుండా కాబినెట్ నోట్ రాదూ, రానివ్వం అని ప్రగల్బాలు పలికారు.. అది కూడా వచ్చింది
 • నోట్ వస్తే సరిపోద్దా అది ఆమోదం పొందాలికదా అన్నారు, మీరు వున్న మీటింగ్ లోనే వచ్చింది ఆమోదం కూడా పొందింది!
 • ఆమోదం పొందినంత మాత్రాన రాష్ట్రపతి ఆమోదించాలి కదా అన్నారు, రాష్ట్ర అసెంబ్లీకి బిల్ వస్తే ఓడిస్తాం అదీ ప్రతిపక్షాల మద్దతుతో అన్నారు, కానీ బిల్లు రావటం లేదు తీర్మానమే అది కూడా చర్చ కోసమే అని తేల్చారు!
 • మా స్టార్ బాటింగ్ వీరుడు వస్తాడు అన్నారు ప్రతి సారి డక్కౌట్ అవుతూనే వున్నాడు కిరికిరి రెడ్డి. అసలు ముఖ్యమంత్రి అనే వాడినే కాంగ్రెస్ అధిష్టానం లెక్క చేయక పోతుంటే ఇంకా ఈడెంపీకుతాడు అని జనాల్ని ఇంకా మభ్య పెడుతున్నారు?
 • సీమంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తే అది ఆ కుర్చికే అవమానం, ఆ కుర్చీలో కూర్చునే వ్యక్తికి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, లేకపోతే రాజీనామా చేసి ఉద్యమం చెయ్యి ఎవరు కాదన్నారు? చేసే పని మీద గౌరవ లేకపోతే రాష్ట్రం ఇంతకన్నా లోతుకి దిగజారిపోతుంది ముఖ్యమంత్రి గారు?
 • రాజీనామాలు చేయటం రాదో లేక ఇష్టం లేదో మాకు తెలియదు కాని, మీరు రాజీనామా చేయక పోయిన ఫరవాలేదు తెలుగు ప్రజలని ఇంకా ఇంకా మోసం చేయకండి, ఇంతకన్నా దగా, మోసం, కుట్ర మేము భరిన్చలేము!
 • ఆఖరికి మీ పార్టీ నాయకులే దొంగబ్బాయి గజన్ కోసం కాంగ్రెస్ మోసం చేసింది అని అంటుంటే ఇంకా దొంగల పార్టీ ప్రజలని మోసం చేయాలనే భావం తో పనే చేస్తున్న మాట నిజామా?… కాదా?

ఉద్యోగులకు నా సూటి ప్రశ్న. సీమాంధ్ర  ఉద్యమాన్ని కిన్చపరచలేను ఎందుకంటే దానిని ప్రజలు మోసారు కాబట్టి. కాని ఉద్యోగుల ప్రవర్తన మాత్రం ప్రజల్ని మోసం చేసే విధంగా ఉంది, ఎందుకంటే పైన కాంగ్రెస్ నాయకులు చెప్పినవన్నీ వీరు కూడా చెప్పి ప్రజల్ని 80 రోజులుగా రోడ్లపైన వుంచి జీతలకోసం ఉద్యోగాల్లో చేరి ఇప్పుడ ప్రజలు ఎవరికీ ఓటు వెయ్యాలో వీరు చెప్తారు అంట మేము వినాలంట.

 • స్పష్టమైన హామీ వస్తే నే ఉద్యమం ఆపుతం అని, ముఖ్యమంత్రి హామీ ఇవ్వక పోయినా ఎందుకు ఉద్యమాన్ని ఆపారు?
 • జీతాల కోసం ఉద్యమాన్ని మీరు ఆపి ప్రజల్ని ఎందుకు ఇంకా ఉద్యమం వైపు నడిపిస్తున్నారు?
 • మీరు ఎవరు మేము ఎవరికీ ఓటు వెయ్యాలో చెప్పటానికి, ఏమి అధికారం వుంది మీకు?
 • అసలు విలువలేని ముఖ్యమంత్రి కి కోమ్ము కాస్తూ ప్రజల్ని ఇంకా మభ్య పెట్టకండి. అది ప్రజలకి మీ మీద వున్న గౌరవాన్ని పోగొట్టి మిమ్మల్ని కాంగ్రెస్ నాయకుల్లగా ఈ సమాజం శ్రేయస్సు కోరే పాత్రలనుండి భాహిష్కరిస్తారు. అది గుర్తెరిగి ప్రవర్తిస్తే మీకు మాకు మంచిది.

అశోక్ బాబు గారు ఒకసారి తెలంగాణా NGOలకు సంఘీభావంగా వారితో కలిసి ఉద్యమంలో పాల్గొనిన ఆధారం ఇప్పటికే చాలామంది చూసారు? కాంగ్రెస్ తొత్తుగా అయన చెప్పేది  ప్రజలు ఎందుకు విస్వసించాలి? మరి ఇలాంటి వ్యక్తులు ఉద్యమాన్ని నడుపుతుంటే ప్రజల్ని గొర్రెలు చేసి అయోమయంలో నెట్టడం తప్పే కదా

మరలా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పుంజుకుంటున్నది అన్న ఇంటలిజెన్స్ నివేదిక చూసి కాంగ్రెస్ నాయకురాలకు కళ్ళు బైర్లు కమ్మి, తెలుగుదేశం పున్జుకుంటే కేంద్రంలో కాంగ్రేస్సేతర ప్రభుత్వం ఎక్కడ వస్తుందో అన్న భయంతో , అదే నివేదికలో అధినేత్రి, ఆమె కొడుకు కూడా ఉత్తర ప్రదేశ్ లో గెలిచే అవకాశం లేదనే నిజం జీర్ణించు కోలేక… ఉద్యమం మొదలు పెట్టిన దశాబ్ద కాలం తరువాత తెలంగాణాను దుమ్ము దులిపి తెలంగాణా ప్రాంతంలో ycpని లేకుండా చేసి తెరాసతో పొత్తు పెట్టుకొని, సీమంధ్రలో తన బలాన్ని ycpకి బదలాయించి అ పార్టీ సమైఖ్య నినాదాన్ని బుజనికేత్తుకొనేలా చేయించి ప్రజలను మభ్యపెట్టి  తరువాత తనలో కలుపుకొనే పధక రచన చేసింది దగాకోర్ కాంగ్రెస్ . చంటబ్బాయి పప్పుని తెలంగాణా నుండి పోటి చేయించి గెలుపొందొచ్చు అని నీచ రాజకీయానికి తేర తీసింది నికృష్ట కాంగ్రెస్. సరిగ్గా 10 ఏళ్ల కిందట ఇద్దరి స్వార్ధ రాజకీయ భవిష్యత్తు కోసం ఎలా అయితే రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారో సరిగ్గా అలాగే ఇప్పుడు కూడా ఇద్దరి రాజకీయ జీవితాల(చంటబ్బాయి, దొంగబ్బాయి) కోసం తెలుగు ప్రజలను, వారి బిడ్డల భవిష్యత్తును కర్కశంగా బలిచ్చి ఆ రక్తంతో అధికారానికి అభిషేకించి మిగిలిన మాంసపు ముద్దను కూరోన్డుకొని తినటానికి సిద్ధమయ్యారు దిక్కు మాలిన తల్లి – పిల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది పచ్చి నిజం, అవునా?…కాదా?

అన్నీ పార్టీలు లేఖలు ఇచ్చినాయి అని ప్రతి రోజు గీతం పడే డిగ్గి రాజా, లేఖలోని రెండో పేజి చదవటం ఇష్టం లేదనుకుంటా. వారు ఏమి రాసారు.. ఇరు ప్రాంతాలకి ఆమోదయోగ్యమైన విభజన చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు అని రాసి మరీ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినంత మాత్రాన అందరినీ గుద్దుకుంటా వెళ్ళమని కాదు రాజా, రూల్స్ పాటిస్తూ రోడ్ప పైన పద్ధ్తతిగా వెళ్ళమని. విభజించాలని నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? నీటిని ఎలా పంచుతారు, రాష్ట్రం ప్రభుత్వం చేసిన అప్పులు ఏ ప్రాతిపదికిన పంచుతారు, రాష్ట్ర రాజధానిలో పెట్టిన పెట్టుబడులు, వాటి నుండి వచ్చే ఆదాయాన్ని ఎలా పంచుతారు. కనీస భాద్యతగా ఎలా చేయదలిచారో చెప్పాలి కదా? ఇలా పంచ దలచాము అని అందరిని కూర్చోబెట్టి విభజిస్తే మీకు పోయేది ఏముంటది? తెలుగుదేశం పార్టీని బలహీన పరచటానికి తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకోవటం మీ నీచ నికృష్ట  అసంబద్ధ నియంతృత్వ నిర్ణయాలకు పరాకాష్ట. ఒక ఒర్దినన్స్ కేంద్ర కాబినెట్ ఆమోదం పొందిన తరువాత కూడా చంటబ్బాయి రాహుల్ పప్పుకి నచ్చలేదని చించి పారేసిన కాంగ్రెస్ మరి ఇక్కడ ఎంతో మంది తెలుగు బిడ్డలు 80 రోజులుగా మీరు తీసుకున్న నిర్ణయం మాకు నచ్చలేదో అని మొత్తుకుంటుంటే కనీసం ఒక్కడికైనా చీమ కుట్టినట్టైనా లేదు. ఎందుకు తెలుగు వారంటే కాంగ్రెస్ కు అంత కోపం,

 • ఈ దేశాన్ని నిరంకుశంగా పాలిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాలితో తన్నితే పడున్దకుండా పార్టీ పెట్టిన  9 నెలలో మిమ్మల్ని మట్టికరిపించిన తెలుగుదేశంకు పట్టం కట్టడం తెలుగు ప్రజలు చేసిన తప్పా?
 • దేశం కోసం పి.వి. మిమ్మల్ని పక్కన పెట్టడం తప్పా?
 • దేశ భవిష్యత్తు కోసం తెలుగుదేశం NDA కి మద్ధత్తు  ఇవ్వడం తప్పా?

పనికిమాలిన వాడని తెలిసి కూడా జనాల మీద నీ కొడుకుని రుద్దాలని చూస్తే ఊరుకోటానికి తెలుగు బిడ్డలు చేవ చచ్చినవారు కాదు ఇటలీ ఒనియా.., బిజియమ్మా ఇక్కడ నీ కొడుక్కోసం కాంగ్రెస్ వారితో చేతులు కలిపి ఎంతో మంది తెలుగు ఆడపడుచుల బిడ్డల ఉసురు మీకు తగలకుండా పోదు.

తెలుగు ప్రజలకు ఓక విన్నపం, కాంగ్రెస్ భూస్థాపితంచేస్తే గాని మనకు న్యాయం జరగదు, కాబట్టి కాంగ్రెస్ కి సాయం చేసేవారిని కూడా దూరంగా పెడతారని ఆశిస్తూ… మీ హర్ష.

Advertisements
Standard