రాజకీయాలు

వీరిని ఏంచెయ్యాలి ? ( వీరిని ఏమనాలి-2)

నమస్కారం,

కొందరు రాజకీయ నాయకులను ఏమనాలో, ఏమ్చేయ్యాలో అర్ధం కాక వీరిని ఏమనాలి అనే వ్యాసం రాసాను దానికి కొనసాగింపుగానే ఈ వ్యాసం.

ఈ మధ్యన ఒక తెలంగాణా పార్టీలోని నాయకులు దొరకని కేసంటూ లేకుండా పోయింది… అమ్మాయిలను సాని కొంపలకు అమ్మే కేసులో , దొంగ పాసుపోర్టులు కేసు లో, IPL మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో, కబ్జా కేసులో,  వసూళ్ళ కేసులో ఇంకా ఏమి లేవు అనుకుంటుండగానే సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడి పుత్రరత్నం ఏకంగా కిడ్నాప్ కేసులో అడ్డంగా దొరికాడు. వీరిని ఏమని తిట్టాలో కూడా అర్ధం కావటం లేదు. ఇలాంటి రాబందు దొరల చేత చిక్కి అల్లాడుతున్న తెలంగాణా ప్రజలను చూస్తుంటే జాలి పడాలో లేక ఏడవాలో అర్ధం కావటం లేదు. ఇలాంటి వాళ్ళని లక్ష చెప్పులతో కాదు, జీవిత కాలం చప్రాసి పని చేసినా వారు ఈ తెలుగు గడ్డకి చేసిన పాపం పోదు. వంద మంది నిర్భాగ్యుల బాలి దానాల పైన కూర్చొని వికటాట్టహాసం చేస్తూ చేయకూడని సంఘవ్యతిరేక పనులన్నీ చేస్తూ ఈ సమజాన్ని, వ్యవస్తలని అపహాస్యం చేస్తూ వీరు సాగిస్తున్న రాజకీయ క్రినీడలను ఇకనైనా తెలంగాణా తెలుగు ప్రజలు అర్ధం చేసుకొని వీరిని భోంద పెడితేనే వీరికి సరైన శిక్ష.

ఇది ఇలా వుంటే పిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు జనాల చెవిలోనే పువ్వులు పెడుతూ వచ్చారు, ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి జనాల కళ్ళని కూడా మోసం చేసే ప్రయత్నం చూస్తుంటే “నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు” అనే సామెత గుర్తుకు వస్తుంది. కృష్ణ పట్నం  భూకేటాయింపు సంబంధించి ఒక శీర్షిక ఈనాడు వెలుగులోకి తీసుకు వస్తే చదివిన వారంతా వీరి అవినీతి దాహానికి ఎప్పటికీ తీరుతుందో అని నోళ్ళు నొక్కుకోవటం ప్రజల వొంతైంది.ఎటువంటి MOU కుదుర్చు కోకుండా దాదాపు 5౦౦౦ ఎకరాలు ప్రజల సొమ్మును ఎటువంటి హామీ లేకుండా ధారాదత్తం చేయసాడు అప్పటి అవినీతి ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి. దానికి పిల్ల కాంగ్రెస్ నాయకులు 1998 లో చంద్రబాబు హయం లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో MOU కుదిరింది అని పిల్ల కాంగ్రెస్ తిరుపతి MLA ప్రెస్ మీట్ పెట్టి నొక్కి వక్కాణించాడు. కాని అసలు విషయం 1998లో చంద్రబాబు హయాంలో NATCO PHARMA తో DFO(Detailed Feasibility Report ) అనగా సాధ్యాసాధ్యాలు నిసితంగా పర్సీలిన్చటానికి కుదుర్చుకున్న ఒప్పందం, దానిని చూపించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రజల చెవిలో పెట్టె పూలను ఇప్పుడు స్వయానా ఆ పార్టీ MLA కళ్ళల్లో కూడా పెట్టె ప్రయతం గర్హనీయం. MOUకి DFOకి తేడా ప్రజలకి తెలియదని వారు అనుకున్నారేమో, ప్రజలు అంత అవివేకులు కాదు నీతి బ్రష్ట నాయకా. కృష్ణపట్నం ఇన్ఫ్రా టెక్ వేల ఎకరాలు ఎవడబ్బ సొమ్మని ధారాదత్తం చేసాడు మీ నాయకుడు, ప్రజల సొమ్మును చాక్లెట్ చప్పరించినట్టు చప్పరించి మీరు కూడబెట్టే ఆస్తులు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆఖరికి మీ CA సాయి రెడ్డిని RBI గవర్నర్ చేయాలనీ అవినీతి బ్రష్ట నాయకుడు ప్రయత్నం చేయటాన్ని చూస్తే ఎంత తిన్నా సరిపోక చివరికి డబ్బులు ప్రింట్ చేసుకోటానికి చేసే ప్రయత్నంగా ప్రజలకు అనిపిస్తుంది. ఇలాంటి నీచ భుద్ధి కలిగిన వాళ్ళని  ఏమి చెయ్యాలి, ఏమి అనాలి.

నీతి బ్రష్ట పనులు చేస్తున్న తెలంగాణా పార్టీ MLAలను, నాయకులను ఎన్నుకొని నేత్తిన పెట్టుకున్నామనే తెలంగాణా ప్రజల భాదను అర్ధం చేసుకోగలం అలాగే ఒక MLA అయ్యుండి MOUకి DFOకి తేడా తెలియని దద్దమ్మని ఎన్నుకున్నామే అని తిరుపతి ప్రజలు ఎంత బాధ పడుంటారో అర్ధం చేసుకోగలము, మరలా అటువంటి తప్పు చెయ్యొద్దని తెలుగు ప్రజలకు మనవి చేసుకుంటూ మీ హర్ష.

Advertisements
Standard
రాజకీయాలు

వీరిని ఏమనాలి?

నమస్కారం,

గత కొన్ని రోజులుగా దినపత్రికల్లో వస్తున్న వార్తలు చూసి మన రాజకీయ నాయకులను ఏమనాలో అర్ధం కాక మిమ్మల్ని అడుగుతున్నాను. వివరాల్లోకి వెళ్తే…

తెలంగాణా రాష్ట్ర పార్టీ నాయకుడు ఒకడు అమ్మాయలని పడుపు వృతి కోసం అక్రమంగా తరలిస్తూ పట్టుబడటం ఎంత దౌర్భాగ్యం, ఇంత నీతి బ్రష్టమైన పని చేయటానికి అ నాయకుడికి చేతులెలా వచ్చాయి? ఇది మరచిపోక ముందే ఇదే పార్టీ కి చెందిన మరొకడు దొంగ పాస్పోర్ట్ కేసులో దొరికాడు. మరలా లేటెస్ట్ గా ఆ పార్టీకి సంబంధిచిన ఇంకో నాయకుడు IPL మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్  కేసులో దొరికాడు.వారిని ఆ పార్టీ ఎలా సమర్ధిస్తుందో నాకయితే అర్ధం కావటం లేదు.ఇలాంటి వెధవల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయరా అని సదరు విలేకర్లు ఆ పార్టీ నాయకుడి పుత్రరత్నం ని  అడిగితే  ఆ సిగ్గులేని నాయకులను వెనకేసుకు రావడం నిజంగా ఏనాడో తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.

ఇంకో పార్టీ, అవినీతి-అధర్మాలకి పుట్టిన పార్టీ అది. ఆ పార్టీ జిల్లా నాయకుడు ఒకడు తన సొంత ఇంట్లోనే పడుపు వృతి సాగిస్తున్నాడు. చ్చీ… ఇలాంటి చీడ పురుగుల్ని పార్టీలో ఎలా కొనసాగిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు. అంతేలే ఆ పార్టీ అధికార ప్రతినిధే (అం-బోతూ(బటి) రాంబాబు ) కామందుడయితే మాములు నాయకులు అంతకన్నా ఏమి చేస్తారులే. ఈ పార్టీకి వయసు తక్కువైనా వున్న కేసులు మాత్రం తల్లి పార్టీతో పోటి పడుద్ది.

భారతీయ సంప్రదాయంలో ఆడవారికి ఎంతో గౌరవం ఇస్తాము, మరి అటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన మన సమాజంలో ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులు ఎందుకు ఉపెక్షించాలి, చట్టం నుండి తప్పించుకున్నా మనమందరం మన వోటు హక్కుతో వీరి చెంప చెల్లుమనేలా తీర్పు ఇచ్చిన నాడే మనం మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకోగలమని విశ్వసిస్తూ మీ హర్ష.

Standard