రాజకీయాలు

భారతక్కకి బహిరంగ లేఖ

భారతక్కా నీ అడ్డగోలు లేఖ నీ పత్రికలో చూసి అర్ధం చేసుకోటానికి నాకు చాలా సమయం పట్టింది. నీ ప్రశ్నలకు సమాధానం ఈ భూప్రపంచం మీద ఎవరికీ తెలియవు గాని, నాలాంటి చిన్నవాడి ప్రశ్నలు నువ్వు గాని నీ జఫ్ఫాగాళ్ళు గాని సమాధానం చెప్పగలరా?

నీ పేపర్ కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవొచ్చు, కాని సుప్రీమ్ కోర్టు తీర్పు ఎక్కడా ప్రస్తావిన్చలేదేంటక్కా “ఆర్ధిక నేరం అన్నది తీవ్రవాదం కన్నా చాలా తీవ్ర మైన నేరం. చట్టం లోని లొసుగులు అడ్డం పెట్టుకుని సమాజాన్ని దోచుకుని తినే మీ ఆయనలాంటి వారిని పట్టుకోవాలంటే వ్యవస్ధలకి చాలా కష్టం, దీన్ని మొగ్గలోనే కాదు కూకటి వేళ్ళతో సహా పెకలించాలి” అని ఇద్దరు న్యాయమూర్తులు స్పష్టంగా ఒకే తీర్పు ఇచ్చారు. మీ తరుపున కోట్లు కర్చుపెట్టి మరీ ముగ్గురు లాయర్లు వాదించినా సుప్రీమ్ కోర్టు వెలువరించిన తీర్పును ఎక్కడా ప్రస్తావించకుండా నీ బహిరంగ లేఖ అదిరింది సుమీ.

నీకు నీ కుటుంబానికి నొప్పి కలిగించేవి మాకేందుకులేగాని, మాకు నొప్పి కలిగించేవి కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుతాను సమాదానమివ్వు.

 1. 2004-09 కి ముందు 12 సంవత్సరాలుగా నీ భర్త వ్యాపారాలు చేసి సంపాదించింది 90 లక్షలు.పైసా పెట్టుబడి లేకుండా 2009 కల్లా 43 వేల కోట్ల ఆస్తి ఏక్కడేక్కడి చమట పిండి మరీ సంపాదించాడక్కా?
 2. మీ మామ అధికారంలో మీ ఆయనకు కట్టబెట్టిన అవినీతిని సొమ్ము గురించి మెడకు డోలు కట్టుకొని మరీ ప్రతిపక్షాలు చెప్తే లెగవని నోరు, లేఖలు రాసే చేతులు ఇప్పుడెందుకక్కా? చేతులు కాలింతరువాత ఆకులు పట్టుకొని ఏమి లాభం.
 3. మీ మామ మీ ఆయన కోసం దగ్గరుండి మరీ పెట్టించుకున్న సంతకాలకి (ప్రభుత్వ ఉత్తర్వులు) మంత్రులు కూడా భలయ్యారు కదక్కా, నిన్న మోపిదేవి రేపు ధర్మాన, సబితమ్మ ఎల్లుండి పొన్నాల ఆ తరువాత కన్నా ఇలా లైను చాంతాడంత వుంటే మంత్రులందరూ సరదాగా బయట తిరుగుతున్నారు అంటావేంటక్కా?
 4. మీ ఆయన 2004-2009 మధ్య MLA కాదు MP కాదు మరి ఏ అధికారంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో మీ మామ పక్కన కూర్చున్నాడక్కా? ఇంతా చేసి ప్రభుత్వ ఉత్తర్వులు గురించే చెప్పుకునే స్థితిలో మీ అయన లేడంటే నమ్మనికి జనాలు ఎలా కనపడుతున్నారక్కా?
 5. మీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు మీ మామ జనం సొమ్మును, రైతుల భూములను, పట్టా భూములను దర్జాగా దారాదత్తం చేసిననాడు వారికి కలిగిన నష్టం, అన్యాయం నీకు కనపడలేదా, అవన్నీ బయటక తీయటానికే ఇంత సమయం పడుతుందంటే మీ అయనది మామూలు కేసు అని ఎలా అనుకుంటామక్కా?
 6. మాకు(జనాలకు) జరిగితే అది అన్యాయం కాదు, మీరు చేసిన కర్మ అనుభవించేటప్పుడు మాత్రం న్యాయాన్యాయాలు గుర్తుకువస్తాయా, అప్పుడు లేగవని గొంతుకలు ఇప్పడు మాత్రం ఎందుకు లేస్తున్నాయక్కా? దోచుకున్నది కాపాడుకోవటానికే కదక్కా.
 7. సాక్షి డమ్మీ కంపెనీ కాదు అని నొక్కి వక్కాణించే నువ్వు, దానిలో పెట్టుబడులు పెట్టిన అడ్రసు లేని డమ్మీ కంపెనీల గురించి మాట్లాడవేంటక్కా?
 8. విదేశాలనుండి మరీ ముఖ్యంగా మారిషష్ నుండి, మలేషియా నుండి పెట్టుబడులు పెట్టిన వాళ్ళని నేరుగా కోర్ట్ కి తీసుకు వచ్చి మీ వ్యాపారాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి అందుకే మీ అయన మీద ప్రేమతో కాకుండా ఆయన దిమ్మ తిరిగిపోయే లాభాలు తెచ్చే వ్యాపార వేత్త కాబట్టి సొమ్ములు ఇచ్చాము అని అఫిడవిట్ లు వేస్తే సారి పోతుంది కదా? ఆ పని చేయకుండా సిబిఐ మీద  పడి ఎందుకు ఏడుస్తున్నట్టు?
 9. వ్యాపారం కోసం వచ్చిన ప్రతి పారిశ్రామిక వేత్తకి 20 శాతం రేటు కట్టి మరీ పైసలు వసూలు చేసిన ఘనత మీ మమ, భర్త లది కాదా? డబ్బులు ఇవ్వని వారి మీద తనిఖీలు, దాడులు, అధికారులని ఉసిగొల్పటం నిజం కాదా?
 10. మీ అయన వల్ల జైల్లో ఊచలు లెక్కపెడుతున్న ఐ.ఏ.ఎస్ స్థాయికి ఎదిగిన ఉద్యోగులగురించి, వారు కుటుంబసభ్యుల మనోవేదన గురించి  ఒక్క మాటా కూడా ఎందుకు రాయలేదక్కా నీ బహిరంగ లేఖలో?  అంతేలే పక్కోడి కడుపు మాడుతున్నా నీకేం, నీ కడుపు మాత్రం సల్లన్గావుండాలి అంతేకదక్కా?
 11. చక్కగా వ్యాపారం చేసుకుంటున్న సత్యం రామలింగరాజుని ఇష్టం వచ్చినట్టు వాడుకొని సత్యం ను తిరగేసి మైటాస్ అని రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టించి అయన జీవితాన్నే తలకిందులు చేసింది నీ మామ, భర్త కాదా అక్కాయ్?  రామలింగరాజును ఇప్పుడు చూసినవారు అయ్యో పాపం అనకుండా ఉండలేరు ఒక్క మీ కుటుంబం తప్పితే.

పేపర్ వుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు రాసి, చానెల్ ఉందికదా అని ఊక దంపుడు ఉపన్యాసాలు వినిపించి అమాయకపు ప్రజల్ని మభ్యపెట్టటం, మోసం చేయడం ఆపి సమాజం పట్ల, వ్యవస్థల పట్ల కొంచమన్నా భాద్యతాయుతంగా ప్రవర్తిస్తే మీకు మాకు మంచిది. ఇకనైనా తప్పు ఒప్పుకొని సమాజంలో కొంతైనా నిజాయితీ వుందని నిరూపించాల్సిందిగా మనవి చేస్తూ మీ హర్ష.

(courtesy: తెలుగు మీడియా నిజాలు)

Advertisements
Standard