రాజకీయాలు

శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి పాదయాత్ర, నేర్చుకోవాల్సిన పాటాలు…

40 ఏళ్ళ వయసులో పట్టుమని 4 అడుగులు వేయటానికి ఇబ్బంది పడే ఈ రోజుల్లో, 64 ఏళ్ళ వయసులో పట్టువదలకుండా, అకుటిత దీక్షతో, భాధ్యతో, నిజాయితీగా నిత్యం ఎన్నో సమస్యలతో అల్లాడుతున్న ప్రజల కష్టాలను తెలుసుకోవాలని కృత నిశ్చయంతో అక్టోబర్ 2వ తేదీన మొదలైన చంద్రబాబునాయుడిగారి పాదయాత్ర

పదుల జిల్లాలు…

వందల మండలాలు…

వేల గ్రామాలూ దాటుకుంటూ…

వారికి భరోసా కల్పిస్తూ…

తెలుగుదేశం పార్టీ ఎలా సహాయం చేస్తుందో చెప్తూ ముందుగా నిర్ణయించబడిన తేదీని కాదని.. తన భాద్యతను అనుక్షణం గుర్తు చేసే ప్రజల నీరాజనాలు, ప్రజలకు తనమీదున్న నమ్మకాన్నివొమ్ము కానీయకుండా 7 నెలలుగా 2700 పైచీలుకు కిలోమీటర్ల దాటి సుదీర్గంగా సాగిన పాదయాత్రను నేటితో విశాఖపట్టణంలో భారీ బహిరంగసభతో ముగియనున్నందున తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మనసారా అభినందిస్తూ…

పట్టుదల… శ్రీ చంద్రబాబునాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టిన నాటినుండి ఇప్పటివరకూ తను చేస్తున్న పని మీదనుండి దృష్టి మరల్చటానికి ప్రత్యర్ధులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా అకుటిత దీక్షతో పట్టువదలకుండా, నిజాయితీగా, నిభాద్ధతతో పూర్తి చేసిన చూపించారు. “పట్టుదలే వుంటే మనిషి కాగలడు మరో బ్రహ్మ” అన్న అన్నగారి మాటలను చేసి చూపించి మాలాంటి యువకులకు చేసే ప్రతి పనిని నిజాయితీగా నిభాద్ధతతో కూడిన పట్టుదల ఎంత ముఖ్యమో తెలియ చేసిన ఓ బహుదూరపు బాటసారి నీకు పాధాభివందనం.

క్రమశిక్షణ… ముందుగా అన్నగారు, ఆ తరువాత అంతటి క్రమశిక్షణ వున్న నేతగా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు టక్కున గుర్తుకువస్తారు. తాను అనుకున్న పనిని క్రమశిక్షణతో మొక్కవోని పట్టుదలతో చేస్తే ఎలా కార్యం సిద్ధిస్తదో తెలుసుకుని ఖచ్చితంగా విలువలను పాటిస్తూ పనిని పూర్తి చేసే తత్వాన్ని మాకు మరోసారి భోధించినందుకు మీకు శతకోటి వందనాలు.

నిజాయితీ…  మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ పాలు ఎంతవుంటదో ఆ పని అంత సక్సెస్ అవుతుంది అనటానికి నీ పాదయాత్రే  మాకు ముఖ్య నిదర్సనం. రోజు రోజుకూ మీకు పెరుగుతున్న ప్రజాధరణ, ప్రజల కష్టాలు తీర్చాలనే మీ ఆశయం అందుకు నిదర్సనం. మేము చేసే ప్రతి పనిలోనూ నిజాయితీ తత్వాన్ని ప్రభోదించిన ఓ దార్సనికుడా నీ మేలు ఏ జన్మకు మరువం.

“కృషి వుంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు” అన్న యుగపురుషుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం  స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు సైతం పైనుండి అభినందిన్చేలగా క్రమశిక్షణతో నిజయితీగా పట్టుదలతో పదులు కాదు వందలు కాదు వేల గ్రామాలను కాలినడకన కలియతిరిగి ప్రజల కష్టాల్ని చూసి చెలించి వారి కుటుంబాలలో పెద్దకోడుకుగా…

ప్రతి రైతుకు అండగా ఉండటానికి తన తోలి సంతకం రైతు ఋణం మాఫీ పైనే అని ప్రకటించారు.

మాదిగ సోదరులకు SC వర్గీకరణ చేసి వారిలో పెద్ద మాదిగ అయ్యారు.

BCలకు రానున్న ఎన్నికల్లో 100 సీట్లు, కాపులను BCల్లో చేర్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని మాటిచ్చారు.

ముస్లిం మైనారిటీలకు, క్రైస్తవులకు, మహిళలకు, STలకు, చేనేత కార్మికులకు, నిరుద్యోగులకు ఇలా అందరికీ నేనున్నాను అనే భరోసా ఇస్తూ, సాగిన మీ పాదయాత్ర ముమ్మాటికి ఈ రాష్ట్ర, దేశ చరిత్రలో ఓ మైలురాయి. అనుక్షణం ఈ రాష్ట్ర ప్రగతికై పరితపించే మీ ఆశయ సాధనలో పాలుపంచుకునే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటామనే ఆశతో… మీ హర్ష

Advertisements
Standard