రాజకీయాలు

చంద్రబాబు ఆస్తుల ప్రకటన, వాటి పైన వివాదాలు…సమాధానాలు…

నమస్కారం,

చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటిస్తూ ఒక సరికొత సంప్రదాయానికి తెర లేపారు. ఆ వెనువెంటనే ప్రజల ఆస్తులను దిగ మింగిన అవినీతి నాయకులకు, వారి చెంచా గాళ్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. వారు చంద్రబాబు గారు ప్రకటించిన ఆస్తులను చిలువలు పలువలు చేసి ఇష్టం వచ్చినట్టు రాసే పొట్లాల పేపర్ పిచ్చి రాతల్ని పట్టుకొని “ఎవరు పత్తిత్తు” అని బుజాలు తడుముకునే నాయకులకు, వారి చేమ్చగాళ్లకు సమాదానం ఈ వ్యాసం.

చంద్రబాబు తన ఆస్తులు ప్రకటిస్తూ చేసిన కామెంట్ “ఆస్తుల విలువలు ఎప్పటికప్పుడు మారుతూ వుంటాయి కనుక, నా ఆస్తులు, నా కుటుంబ ఆస్తులు అన్నీ వాటిని కొన్నప్పుడి విలువను మాత్రమే చెప్తున్నాను, వాటిపైన తీసుకున్న అప్పులకు మార్కెట్ విలువతో సంబంధం వుండదు కనుక వాటి పైన తీసుకున్న అప్పును యధా విధిగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆస్తులు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాను  కాబట్టి, మార్కెట విలువ మారుతూ వుంటుంది కాబట్టి, హెచ్చు తగ్గులు వుంటాయి కాబట్టి, వాటిని కొన్నప్పటి విలువ ఆధారంగా నా కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్నాను”.

దీనికి పొట్లాల పేపర్ మరియు జఫ్ఫా గాళ్ళు ఏమి చెప్తున్నారో వరుసగా చూద్దాం.

1.హైదరాబాద్ నడిబొడ్డున, పంజగుట్టలో 650 గజాల స్థలంలో ఓ పెద్ద భవనం. దానిని చంద్రబాబు తన భార్య భువనేశ్వరి పేరిట చూపిస్తూ రూ.73.33 లక్షలను విలువగా పేర్కొన్నారు. మరోవైపు దానిపైనే విజయ బ్యాంకులో రూ.3.46 కోట్ల అప్పున్నట్టు చూపించారు. అంత తక్కువ విలువున్న భూమికి బ్యాంకు దాదాపు ఐదు రెట్లు అధికంగా అప్పెలా ఇచ్చింది? అంటే… బాబు తన ఆస్తి విలువను తక్కువగానైనా చెప్పి ఉండాలి. లేదా బ్యాంకునైనా మోసం చేసి ఉండాలి… నిజానికి 2009 ఎన్నికల సందర్భంగా ఇదే ఆస్తికి బాబు స్వయంగా కట్టిన విలువే రూ.5.69 కోట్లు. నిజానికి ఇప్పుడు దాని అసలు మార్కెట్ విలువ ఎంతలేదన్నా రూ.10 కోట్ల పైమాటే!

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి NTR కుమార్తె, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన అన్న నందమూరి తారకరామారావు, ఆడి తప్పే వాడు కాదు కాబట్టి అందరితో సమానంగా ఆస్తులు పంచారు, వాటిల్లో ఇదొకటి. విషయానికి వస్తే, దాని విలువ 73 లక్షలు అని, దానిపైన అప్పు 3.46 కోట్లని ప్రకటించారు.  బ్యాంకు ఇంత అప్పు ఎలా ఇచ్చింది అని వారి ప్రశ్న, దానికి మసాలాలు జోడించి రాసారు. ఆస్తి విలువ కొన్నప్పటిది కాబట్టి తక్కువ వుంది,   అది తప్పకుండా ఇప్పటి మార్కెట విలువ ప్రకారం చాల వుంటుంది దానిని ఎవ్వరూ కాదనరు.దాని విలువ 10 కోట్లని ఆఖరి లైన్లో వారే రాసారు, మరి 10 కోట్ల విలువైన ఆస్తులకు 3.46 కోట్ల అప్పు ఇవ్వరా? దీనికి బాబు బ్యాంకును మోసం చేసారని , ఆస్తి తక్కువ చెప్పారని ఇష్టం వచినట్టు రాసారు దాని జఫ్ఫా గాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. 

2. తమిళనాడులోని శ్రీపెరంబుదూరు మండలం చెన్నారుకుప్పంలో భువనేశ్వరి పేరిట ఉన్న 50 వేల చదరపు అడుగుల గోదాముల విలువను కేవలం రూ.1.86 కోట్లుగా చూపించారు. కానీ దానిపేరిట యూకో బ్యాంకులో తీసుకున్న అప్పునేమో రూ.5.39 కోట్లుగా పేర్కొన్నారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విలువేమో రూ.10.49 కోట్లు!

చంద్రబాబు గారు 2009లో మార్కెట విలువ ప్రకారం ఆస్తులు ప్రకటించారు, కాని ప్రతి సంవత్సరం ప్రకటించాలి అని నిర్ణయం తీసుకున్న ఆయన కొన్నప్పటి విలువ ప్రకటించటం మొదలు పెట్టారు. ఎందుకంటే మార్కెట విలువ ఎప్పటికప్పుడు మారుతూ వుంటుంది కనుక. విషయానికి వస్తే, చంద్రబాబు 2009లో ప్రకటించిన విలువలో సగం అప్పుగా తీసుకున్నారు. ఇందులో ఏమి తప్పు వుందో జఫ్ఫా గాళ్ళే చెప్పాలి.

3.తొమ్మిదో నంబరు జాతీయ రహదారి పక్కనే, హైదరాబాద్‌లోని అత్యంత విలువైన మదీనగూడలో భువనేశ్వరి పేరిట ఉన్న అయిదెకరాల భూమి విలువ రూ.73.8 లక్షలని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. దీనిపై బ్యాంక్ ఆఫ్ బరోడాలో తీసుకున్న అప్పునేమో రూ.2.98 కోట్లుగా చూపించారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో తనే పేర్కొన్నది కేవలం రూ.9 కోట్లు. నిజానికి దాని ప్రస్తుత విలువ హీన పక్షం రూ.40-50 కోట్ల పైమాటే!

మళ్ళీ అదే తంతు, మార్కెట్ విలువ ఎక్కువే అని చెప్తారు మరి బ్యాంకు నుండి తీసుకున్న ఋణం తక్కువే, ఇంక వీరి సమస్య ఏమిటో అర్ధం కావటం లేదు.  వీరి ఆస్తులు ప్రకటించడం చేయరు గాని ప్రకటించిన వారిని దుమ్మేతి పోయటంలో వీరికి సాటి ఎవ్వరూ రారు.

4. హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 65లో 1,125 గజాల్లో నిర్మించుకున్న ఇంటి విలువ రూ.23.3 లక్షలని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. కానీ ఇదే ఆస్తి విలువను ఆయన 2009 ఎన్నికల అఫిడవిట్లో రూ.8.89 కోట్లుగా చూపించారు. ఉద్దేశపూర్వకంగా తన ఆస్తుల అసలు విలువను అత్యంత తక్కువ స్థాయిలో చూపించి, అదే సమయంలో అప్పుల్ని భారీగా చూపిస్తూ.. అంతిమంగా తనకు పెద్దగా ఆస్తులేమీ చెప్పుకోవటానికి బాబు పడరాని పాట్లన్నీ పడినట్లు ఈ ఉదాహరణలన్నీ ఎలుగెత్తి మరీ చాటుతున్నాయి.

చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తన ఆస్తుల అసలు విలువను అత్యంత తక్కువ స్థాయిలో చూపించ దలిస్తే, మార్కెట్ విలువ ప్రకారం కాదు కొన్నప్పటి విలువ అని ఎందుకు చెప్తార్రా జఫ్ఫా! ఆ విషయం చెప్పి మరీ ఆస్తులు ప్రకటించారు కాని దాచి ప్రజలని మభ్యపెట్టలేదు. దీనికి జఫ్ఫా గాళ్ళు కూసే కారు కూతలు, చెండాలపు రాతల్ని నమ్మాలా?

5. 2004 నుంచి 2009 ఎన్నికల వరకు బాబు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆయన, ఆయన భార్య ఆస్తి కలిపి రూ.21 కోట్ల నుంచి రూ.41.19 కోట్లకు పెరిగినట్టు తేలుతుంది. తాజాగా ప్రకటించిన ఆస్తుల ప్రకారం వాటి విలువ రూ.28 కోట్లలోపే! హెరిటేజ్ సహా వచ్చి పడుతున్న ఆదాయమంతా ఏమైపోయింది? ఈ ఒక్క నిజం చాలు.. బాబు ఆస్తుల ప్రకటన ఎంత బోగస్సో చెప్పటానికి!

2004, 2009 లో మార్కెట్ విలువ ఆధారంగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కొన్నప్పటి విలువ ఆధారంగా చెప్పాడని తెలిసి కూడా వక్ర బుద్ధితో తక్కువ చెప్పాడని అడ్డగోలు రాతలు రాసే వారిని ఏమి అన్నా తక్కువే. హెరిటేజ్ ఆదాయం ఎంత వస్తుందో అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మొన్నట దాకా అది నష్టాల ఓడిదుడుకుల్లోనే నడిచిందన్న వాస్తవాన్ని తొక్కి పెట్టి వచ్చిన ఆదాయం అంత ఏమైపోతుంది అని అడిగే పిచ్చి కూతలకి ఏమని సమాదానం చెప్పాలి. ప్రకటించిన అస్తులకన్నా ఎమన్నా వుంటే అవి తీసుకు వచ్చిన వారికే రాసిస్తాను అన్న మాట ఎందుకు పట్టించుకోరు సదరు పిచ్చి రాత-కూతల సంస్థ. అది చేసిన అభియోగాలు నిజం అంటే నమ్మటానికి రాసినంత ఎధవలు ఎవరూ లేరు చదివే వారిలో…

6. పిచ్చి కూతల సంస్థ చేసిన మరికొన్ని అభియోగాలు. నెల్లూరు లోని వ్యవసాయ భూములు కావొచ్చు, బాబు పేరు మీద వున్నస్థలాన్ని తల్లి అమ్మణమ్మ పేరు మీద చెప్పినది కావొచ్చు, ఎవ్వరికీ కనిపించని ఆస్తులు ఒక్క కూతల సంస్థకే కనపడేవి కావొచ్చు…. ఇలా చెప్పు కుంటూ పోతే ఎంతకీ తెగని అభియోగాలకు సమాదానం.

చంద్రబాబు చేసిన ఓపెన్ చాలెంజ్, తను చెప్పిన ఆస్తులు కాకుండా వేరే ఆస్తులు అని, తన బినామి ఆస్తులు అని కాని నిరూపించ గలిగితే  ఆ ఆస్తులన్నీ వారికే రాసిస్తా…

మీకు ధైర్యం వుంటే మీలో ఇంకా చీము నేత్తురు వుంటే అవి నిరూపించి మీరు తీసుకోవాల్సిందిగా నీతికి నిజాయితీకి నిలబడే ప్రజలందరి తరుపున చాలెంజ్ చేస్తున్నాను.

Advertisements
Standard