జనరల్

నిత్య విద్యార్ధి….

నమస్కారం,

ఈ మధ్యన నేను అనుకోకుండా ఒక స్కూల్ ఫంక్షన్  పేరు నృత్యాగ్రం కు వెళ్ళాల్సి వచ్చింది, 5 నుంచి 15 ఏళ్ళ పిల్లలు అందరు ఈ ఫంక్షన్ కోసం నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించారు. కనుల విందుగా వారు చేసే నృత్యాలు, అబ్బుర పరిచే వారి ప్రతిభను చూసి ఒక్క క్షణం నా మనసంతా నిశ్శబ్దం ఆవరించి నోట మాట రాలేదు. నేను ఈ మధ్య కాలంలో మరిచిపోయినది కాదు కాని ప్రాధాన్యం తగ్గించిన ఒక ముఖ్య విషయాన్ని వారు గుర్తు చేసారు, అదే “నేర్చుకోవటం“. మనుషులే కాదు ఈ ప్రకృతిలో ఏ జీవి అయినా ఉత్తేజితులైనప్పుడు వారికి తోచిన విధంగా స్పందించటం సర్వ సాదారణం. కాని ఇక్కడ పిల్లలు అలా చేయలేదు తెలిసిన గంతులే కదా అని అనుకోలేదు వారికంటే ఇంకా తెల్సిన వారి దగ్గర నేర్చుకొని ఎంతో అందంగా ప్రదర్శించారు. మనుషులందరూ ఒక్కటి కానట్టే వారి భావాలు కూడా ఒకే లాగ వుండవు, కావున మనకు తెల్సిన  విషయమే అయిన ఒక క్షణం ఎదుటి వారి భావాన్ని ఆలకిస్తే మనకు తెలియని కోణంలో మనకు తెల్సిన విషయాన్ని నేర్చుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ప్రాధాన్యం వుందని అప్పుడు అర్ధం అయ్యింది, నిత్య విద్యార్ధిగా వుంటే మనం ఎంత నేర్చుకావొచ్చో, నలుగురికి అంత బాగా చెప్పొచ్చు ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోని విధంగా నేర్పిన ఆ చిన్నారులకు శత కోటి దీవెనలు.

ఈ మధ్యనే ఒకసారి విమానశ్రయంకు వెళ్ళాల్సి వచ్చి పొద్దున్నే 5గంటలుకే అక్కడ చేరుకున్నను. అంత చలిలో కూడా ఒకాయన ఒరామరిగా 70-75 సంవత్సరాలు వుండోచ్చు బిడ్డ కోసం ఎదురుచూడటం నన్ను అలోజింపచేసింది. విమానం వచ్చి చాల సేపు అయినా కనపడని బిడ్డకోసం ఆ తండ్రి పడే తాపత్రయం, కనిపించగానే ఆయన కళ్ళల్లోని వెలుగు, ఎంత బాగుందో. ఎంతో మంది స్నేహితులకోసం, బాబాయిల కోసం, ఏవేవో భంధాలు అనుభందాలు వారి కోసం ఎదురు చూపులు, వచ్చిన వారు నా కోసం ఎవరూ రాలేదా అని ఆందోళన… కనపడగానే ఆనందం, చూడటానికి కళ్ళు చాల లేదు. పైన చెప్పిన తండ్రి కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పుడో ఒకప్పుడు రాకుండా వుండవు కాని ఒకరి పైన ఒకరి ప్రేమ వారిని ఆపలేదు. ఎదుటి వ్యక్తి పైన ప్రేమను చూపించినప్పుడు కలిగే ఆనంద అనిర్వచనీయమైనది, అది చూపించలేక పోవటం ఒక వ్యాధి అనుకుంటాను. అప్పుడే నేర్చుకున్నాను ఎదుటి వారి పైన ప్రేమ వుంటే అది కచ్చితంగా వ్యక్త పరచాలి, వ్యక్త పరిచిననాడు ఎదుటివారిలో కలిగే సంతోషం మనకు ఎంతో శక్తీ ని ఇస్తుంది.

ఇలా ప్రతి రోజు నా చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని నిశితంగా పర్సీలించటం మొదలు పెట్టాను, ఎంతో కొంత నేర్చుకుంటున్నాను. నిత్య విద్యార్ధిగా నేను ఒక విష్యం నేర్చుకునేటప్పుడు నాకు కలిగే ఆ ఆనందం రాయటానికి నాకు పదాలు దొరకటం లేదు. (అంటే నాకు నా మాతృ భాష పైన అంత పట్టు వున్నదనమాట!) నేను నేర్చుకోవటం మొదలెట్టాను, మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ మీ హర్ష.

Advertisements
Standard
రాజకీయాలు

అత్యాచారం చేసినవారిని… ఏమి చేయాలి?

నమస్కారం,

ఢిల్లీ లో ఒక యవతి పైన అతి దారుణంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగం పైన ఇనుప రాడ్డుతో కర్కశంగా దాడి చేసి పొత్తి కడుపులోని పేగులు బయట పడేలా పొడిచి, ఆమెను రోడ్డుపైన విసిరేసిన సంగతి అందరికీ తెలుసు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన వారిని నిర్దాక్ష్యన్యంగా ఉరి తీయాలని కొందరు, కాల్చి పారేయాలని కొందరు, ఇలాంటిది మరలా జరగకుండా వారి మగతనాన్ని నాశనం చేసేలా చట్టాలు తేవాలని కొందరు, ఇలా రకరకాలుగా చాలా మంది చాలా చెప్పారు. వారందరూ చెప్పే శిక్షలన్నీ కలిపి ఒకటిగా చేసి ఆ దౌర్భాగ్యులని శిక్షించాలని నా కోరిక. నా కోరిక తీరదని తెలుసు, కాని ఎక్కడో ఈ సమాజం పైన నమ్మకం ఇంకా వుంది.

సమాజం అంటే గుర్తొచింది, సమాజం అంటే ఎవరు? మనమేగా… మరి మనమందరమూ కలిసి నిర్మించుకున్న, బతుకుతున్న ఈ సమాజాన్ని ఒకడు అధికారం అనే మదంతో  పైశాచికంగా ఈ సభ్య సమాజం యొక్క మానాన్ని(మన సొమ్మును) అత్యాచారం చేసి దోచుకొని, ఆ మహిళ పై దాడి చేసిన విధంగా వ్యవస్తలన్నిటినీ నాశనం చేసి, పేగులు బయటకు పడేలా పొడిచిన మ్రుగాల్లాగే చట్టాలను అపహాస్యం చేస్తూ జైల్లో వుంటే ఎందుకని ఎవరికీ పట్టటంలేదు? వాడు దేవుడని, రాజని, పొగుడుతున్న ఇలాంటి సమాజమా…  పై మహిళకు ఓదార్పు నిచ్చేది, అండగా నిలిచేది, పైశాచిక మృగాలకు శిక్షపడేలా చేసేది? నాకు నమ్మకం కలగటం లేదు. ఆ అవినీతి చక్రవర్తి చేతిలో నలిగిన కొందరి అమాయక ఆక్రందనలు మాదిరిగానే ఆ మహిళ ఆక్రందనలు ఎక్కడ గాలిలో కలుస్తాయో అని భయం నమ్మకాన్ని కలగనివ్వటం లేదు. వేలాడుతున్న ప్రేగులతో ఇప్పటికే అనేసార్లు కోమాలోకి వెళ్లి వచ్చిన ఆ మహిళ దీనంగా న్యాయం కోసం ఈ సమాజం వైపు ఎక్కడ చూస్తుందో అని భయం నమ్మకాన్ని కలగనివ్వటం లేదు, మన భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మించుకున్న మన వ్యవస్తలన్నిటి పైన దాడి చేసిన నాడు స్పందించని ఈ సమాజం ఇప్పుడన్నా స్పందిస్తుందా లేదా అనే భయం నమ్మకాన్ని కలగానివ్వటం లేదు.ఈ రోజు వున్న కసి మరి రేపు అందరిలో వుంటుందా? వుండదు. రేపటి నుంచి అంతా మాములే ఎందుకంటే ఇది జరిగింది ఎక్కడో, మన ఇంట్లో కాదూ కదా! మన వారికి కాదు కదా! అందుకే రేపటినుంచి అంతా మామూలే, ఎవడి పని వాడిది, ఎవడి గోల వాడిది. ఇలాంటి సమాజంలో బతుకుతున్న మనకి ఇంతకన్నా గొప్పగా ఎలా బతుకుతాము, ఎలా ఆలోచిస్తాము, అనుకొని వుండలేక రాస్తున్నాను.

మన తోటి ఈ సమాజంలో జీవించే వారికి నమ్మకం కలిగాలి అంటే అందరూ ఒక్క క్షణం న్యాయంగా ఆ మహిళ గురించి అలోచిన్చినట్టే ఈ సమాజం గురించి ఆలోచిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. ఇలాంటివి మరలా ఏ మహిళ పైన చేయాలనీ ఆలోచన వస్తే ఈ సమాజం ఏమంటుందో అని భయపడేలా చేయాలి. చేస్తారని ఆశిస్తూ.. మీ హర్ష.

Standard
రాజకీయాలు

నేను ఉన్నాను అనే భరోసా….

withCBN

 

అందరకీ నమస్కారం,

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలుపటానికి నేను కూడా ఆయనతో కొద్ది దూరం కలిసి నడవటం, కొద్ది సేపు సంభాషించటం నా అదృష్టం.  ఎందుకంటే 63 సంవత్సరాల ఒక వ్యక్తి, 9సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక నాయకుడు, 8సంవత్సరాలుగా ప్రతిపక్షనేతగా వుంటూ, ఒక భాద్యతాయుత మైన ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా వున్న వ్యక్తి ఎండనక, వాననక, చలిలో, రాళ్ళు రప్పలను దాటుకుంటూ ఎవరికోసం నడుస్తూన్నరూ అని నేను అడిగితే… ” ప్రజల కోసం, ప్రజలు కష్టాలలో వున్నారు, వారికి సమస్యల పైన పోరాటం చేయటానికి, వారిని చైతన్య పరచాల్సిన బాధ్యత నా పైన వున్నది తమ్ముడూ” అని టక్కున ఆయన చెప్పిన సమాధానం విన్న తరువాత నాకు అనిపించింది, ఆయనతో కలిసి నడవటం నా అదృష్టంగా కంటే నా భాద్యతగా భావించాను.

నమస్తే సార్, అన్న నన్ను ఒకసారి చూసి నా పేరు, ఊరు, ఏమి చేస్తున్నారు అని చాలా నెమ్మదిగా, మర్యాదగా అడిగిన ఆయనను చూసి నాకు ఒకింత ఆశ్చర్యం కలిగింది. ఇంత పెద్దనాయకుడు ఒక సామన్యుడనైన నాలాంటి వాడి భుజం పైన చెయ్యివేసి అలా మాట్లాడటం నాకే కాదు ఎలాంటి వారికైననూ ఆశ్చర్యం కలగక మానదు. నా సమాదానాలు సావధానంగా వింటూ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అందులో ఆయన బాధ్యతను తెలుపుతూ ఆ రాళ్ళు రాప్పలలో ఆయన నడకని అతి దగ్గరగా చూసి అనుభవించిన తరువాత ఒక ఆదర్సమంతమైన నాయకుడు అంటే ముమ్మాటికి ఇలానే వుండాలి అనే భావన నాకు కలిగింది. చాలా మందిలో స్పూర్తిని రగిలిస్తూ, నిస్సహాయం స్తితిలో వున్న తెలుగు తమ్ముళ్ళను జాగృత పరుస్తూ, జనం కోసం కాకుండా స్వయం సేవలో తరిస్తున్న వైరి పక్షాలను చెంపలు చెల్లుమనేలా వాతలు పెడుతూ , తనతో కలిసి నడుస్తున్న ప్రజల కష్టాలు వింటూ చేతనైన సహాయం చేస్తూ ఆయన తలెపెట్టిన ఈ పాదయాత్ర ఒక సాహసం. యాత్రలో పాల్గొనే వారి కష్టాలు విని వారి సాంత్వన చేకూరేల ఆయన ఇచ్చే వాగ్దానాలు ఎలా తీరుస్తారూ అని అడిగే వైరి పక్షాలకు ఒక్కటే సమాదానం, 1995లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని క్లిష్ట పరిస్తితుల్లోనుండి జబ్బల చరుచుకుంటూ లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టేలా మన రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచారో అలానే ఆయన వాగ్దానాలు తీరుస్తారు. మీకు చేత కాకపోతే నోరు మూసుకొని ఇంట్లో కోర్చో వలసిందిగా నా మనవి. ఆయన చేస్తున్న వాగ్దానాలు కష్టాల్లో వున్న ప్రజలకోసం కాని లారీలకు లారీలు డబ్బు దోచుకోవటానికి కాదు.

దోచుకున్న డబ్బు కోసమో , పదవి కాపాడుకోవటం కోసమో ఆయన రోడ్డేక్కలేదు, రైతు కి రణ మాఫీ అయినా , డ్వాక్ర మహిళల రుణాలు మాఫీ అన్నా, విద్యార్ధులకు లాప్ టాప్ అన్నా, మాదిగ సోదరులకు వర్గీకరణ అన్నా, ముస్లింలకు నిజమైన రిజర్వేషన్ అన్నా.. కష్టాల్లో వున్న ప్రజలకు అండగా నేనున్నాను అన్న భరోసా ఇవ్వటానికి రోడ్డెక్కారు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం అనేది ప్రతి ఒక్కరి భాద్యత, అది గుర్తు చేస్తూ తానూ చేయగలిగింది చెప్తూ, తనకు చేతనైనంత వరకు ఒక ముద్ద పెట్టేవాడినే కాని కాని, ఒకడి నోటికాడ కూడు లక్కోటానికి కాదు అని తనకు, కష్టాల్లో వున్న ప్రజల ఆస్తులను కూడా పీక్కు తినే  తల్లి, పిల్ల కాంగ్రెస్ రాబందులకు వ్యత్యాసం చూపుతూ మన కోసం ఆయన పడుతున్న కష్టాన్ని గౌరవిద్దాం, తెలుగుదేశాన్ని చంద్రబాబును ఆదరిధం.

ఈ వయసులో ఆయన చేస్తున్న సాహసాన్ని మనసారా అభినందిస్తూ, ఆయన ఇస్తున్న భరోసాను కొండంత ఆత్మా విశ్వాసంగా మలుచుకొని, నా కోసం, నా కుటుంబం కోసం, నా సమజం కోసం ఆయన పడుతున్న కష్టాన్ని వృధా కనివ్వనని మనఃస్పూర్తిగా ప్రమాణం చేస్తూ మీ హర్ష… మరి మీరు….

Standard
రాజకీయాలు

ఓ రైతుబిడ్డ వ్యధ…..

అందరికీ నమస్కారం,

ఆంధ్రజ్యోతి దినపత్రికలో ” రైతు వ్యధ ” చదివిన తరువాత ఒక రైతుబిడ్డగా అది జీర్ణించుకోలేక పోయాను, అన్నపూర్ణగా ఓ వెలుగు వెలగాల్సిన రాష్ట్రానికి అసలు ఏమైంది. రైతు ప్రభత్వంగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం మరి ఏమి చేస్తున్నట్టు. చంద్రబాబు రైతుకి ఏమి చయలేదు చేసిన్దందంతా పాత కొత్త కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే మరి రైతు ఆత్మహత్యలు చంద్రబాబు హయం కంటే రెండింతలు ఎందుకు ఎక్కువైనట్టు. రైతులకి అది చేసాం ఇది చేసాం అని ప్రగల్బాలు పలకటం తప్పితే ఏమి చేయలేదని అన్నీ రిపోర్టులు చెప్తున్నాయి.

రైతు దుక్కి దున్నటం మొదలు పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు దగాకోరు సమాజంలో దగాపడుతూ జీవితాన్ని వెల్లదీస్తుంటే, ఇంక రైతు ఏమి బాగుపడతాడు. దుక్కి దున్ని విత్తనాలు కోసం ఎదురు చూపులు, దొరికిన విత్తనాలు కల్తీ, తరువాత ఎరువుల కొరత, రైతు అవసరాన్ని బ్లాకులో దోపిడీ, కాయా కష్టం చేసి మొలకెత్తిన పంటని పురుగులనుంచి కాపాడుకోవటం కోసం ఆరాటపడే రైతుని జలగల్లా పీల్చి పిప్పి చేసే పురుగు మందుల కంపెనీలు. అంతా దాటి పంట చేతికొస్తే దళారుల దోపిడి. ఎక్కడ కలుగుతుంది రైతుకి ఊరట, గాలిలో చిరు దీపంలాగా ముష్టి విదిలించే ప్రభుత్వాలు వున్నంతవరకు రైతుకి ఓదార్పు ఎక్కడ?

చంద్రబాబు రైతులకి పూర్తిగా రుణ మాఫీ చేస్తానంటే, రాబందుల్లా మరలా రాజకీయ ఎత్తుగడలు మొదలుపెట్టారు పిల్ల , తల్లి కాంగ్రెస్ నేతలు. ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు? ఈ పిల్ల కాంగ్రెస్ నేతలు మాత్రం లక్షల కోట్లు దొబ్బి తినొచ్చు గాని రైతు రూమ మాఫీ మాత్రం చేయకూడదంట, ఇదెక్కడి న్యాయం? డబ్బున్న కంపెనీలకు రాయితీలు కోసి రైతులకి ఇవ్వండి, ఏమి ఇవ్వలేరా? ఓహో! అల ఇస్తే వారు మరల పిల్ల కాంగ్రెస్ నేతల కంపెనీలలో పెట్టుబడులు పెట్టరుగా, అందుకే వారు రైతులకి రుణ మాఫీ ఇవ్వలేరు అనుకుంటాను. ఇవన్నీ మాకు అనవసరం, ఎలాగైనా రైతుకు ఇవ్వాల్సిందే? అన్నది  రైతు పంతం, రైతు బిడ్డగా నా అభిమతం.

రుణ మాఫీ ఇస్తే సరిపోదు, అ తరువాత రైతు తల ఎత్తుకొని నిలబడాలి అంటే..  రైతు ఎవ్వరి మీద అదర పడకూడదు. అల చేయాలంటే రైతులు  గ్రామాల యునిట్ గా విత్తన సహకార బ్యాంకు ఏర్పాటుకు కృషి చేయాలి, సాంప్రదాయ పద్దతులలో విత్తనాలు నిల్వ చేయటం వలన కల్తీ విత్తనాల బెడద, విత్తనాల కోసం కొట్లాటలు ఆగుతాయి అనేది నా అభిప్రాయం. రైతు అడిగిన వెంటనే భూసార పరిక్షలు చేసే లాగా ప్రభుత్వాలు కృషి చేయాలి, లేదా రైతు స్వయంగా ప్రతి సంవత్సరం భూసార పరిక్షలు చేసి దానికి తగిన విధంగా ఎరువుల వాడితే కర్చు మరియు భూమి యొక్క సారాన్ని రక్షించిన వారమౌతారు  సేంద్రియ ఎరువులు, పురుగు మందులు వాడటం వలన కర్చు తగ్గించి, లాబం పెంచగలిగేలా కృషి చేయాలి. రైతుకి పర్యావరణం యొక్క విలువ మరవుకుంటే, ఆ పర్యవరణమే రైతుని రక్షిస్తుంది అనేది నా ప్రగాడ విశ్వాసం. నాకు చేతనైనంత వరకు నేను కృషి చేయాలి అని సంకల్పించాను, నాలాంటి రైతు బిడ్డలు కూడా కృషి చేయాలనీ కోరుతూ… మీ హర్ష

Standard