రాజకీయాలు

పిల్ల కాంగ్రెస్ యాత్ర, స్పెషల్ కబుర్లు.. కొన్ని నిజాలు..

నమస్కారం,

వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు పాదయాత్ర మొదలైన దగ్గరనుంచి దానికి వస్తున్న జనాదరణ చూసి ఉలికి ఉలికి పడుతూనే ఉన్న పార్టీ పిల్ల కాంగ్రెస్. చెప్పుకోటానికి పెద్దగా విశేషాలు లేక చానెల్, పేపర్ ఎక్కడ బాబు పాదయాత్ర గురించి రాయాల్సి వస్తదనో  లేక ఇలా అయితే జనాలు మనల్ని మర్చిపోతారేమో అనో గాని తర్జన బర్జనలు పడి ఒక నిర్ణయానికి వచ్చారు, సీన్ కట్ చేస్తే…. ఇంకేముంది పోటీ యాత్ర మొదలు, దించిన తల ఎత్తకుండా వెనకాల ఎవరో తరుముతున్నట్టు నడక, ప్రజల కష్టాలు తెల్సుకొనే దానికంటే బాబుని తిట్టడానికే ప్రాదాన్యం, తండ్రి చేసిన పాపాలకి సమాధానం చెప్పలేక నీళ్ళు నమలటం, ప్రజల కష్టాలు విని వాటిని పట్టించుకోకుండా ఒకటే ఊకదంప్పుడు ఉపన్యాసం, ఇంకా తరిచి చూస్తే గడ్డికి, వేరుశనగ పంటకి తేడా తెలియకుండా పంట పొలాల్లో రైతులకు భరోసా ఇస్తూ వారి యాత్ర సాగుతుంది.

(గమనిక: ఒక ఆడపిల్ల పడుతున్న కష్టాన్ని నేను విమర్శిన్చ లేను, కానీ తీరుని ప్రశ్నించకుండా వుండలేకపోతున్నాను.ప్రజలకి ఉపయోగపడని ఈ కష్టం ఎందుకనేదే నా ప్రశ్న?)

సరే విషయానికొస్తే విధి వక్రీకరించిబడి, విధి ఆడిన వింత నాటకంలో బలి పసువునై, కర్మ కాలి నిన్నపిల్ల కాంగ్రెస్ పిల్ల ఉపన్యాసం వినాల్సి వచ్చింది. అందులో మొదటది…. చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టరు? పెట్టి ఈ దగుల్బాజీ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దించరు? అని ప్రసంగాన్ని మొదలెట్టారు సదరు పాదయత్రికురాలు. ఈ దగుల్బాజీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మీ నయన రెక్కల కష్టమే కదా తల్లి, దానిని మేము కూల్చమన్న మీ అన్న ఇప్పుడు జైల్లో వుండచ్చు గాని, ఆయనగారు అన్న పలుకులు ఎక్కడికీ పోవు. సరే అది కూడా వదిలేసి ఒకసారి మీ అన్న విసిరిన సవాల్ కి చంద్రబాబు అవిశ్వాసం పెడితే ఏమి పీకారని మరలా  సిగ్గులేకుండా అడుగుతున్నారు? అంటే మీరు ఢిల్లీ పెద్దలతో బేరాలు చేసుకోవలనుకున్నప్పుడల్లా చంద్రబాబు అవిశ్వాసం పెడితే బెరాలకి బాగా అనువుగా వుంటున్దనా? అసలు వీరికి కాంగ్రెస్ పెద్దలతో ఏమి పని ? ఎవడికి కనపడకుండా ఢిల్లీలో కలవాల్సిన పని ఏందీ? బెయిలు కావాలంటే ఢిల్లీ ప్రయాణం, రహస్య మంతనాలు. ఇ.డి. జప్తు అని వార్త వస్తే ఢిల్లీ ప్రయాణం, రహస్య మంతనాలు అదీ ఎవరికీ కనపడకుండా. కాంగ్రెస్ తో బేరాలు చేసేది మీరు మరల తెలుగుదేశం కాంగ్రెస్ తో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టటం లేదని బుకాయింపు? అడ్డగోలుగా ఏమి చెయ్యాలన్నా మీ ఫ్యామిలీ తరువాతే ఎవరైనా? జనాలకి అర్ధం కావటం లేదా లేక వీల్లెప్పుడూ ఇలానే మాట్లాడతారు అని జనాలు వదిలేశారా?

రెండోది, చంద్రబాబు రిలయన్స్ కి దోచిపెడితే రిలయన్స్ వాళ్లు ఈనాడులో షేర్లు కొన్నారంట! అవునా…2002లో గ్యాస్ కాంట్రాక్టు పొందితే 2012లో షేర్లు కొన్నారా! మరి మీ నాయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు దీనిపైన విచారణ చేసి అందరినీ మీ అన్న వుంటున్న చెంచలగూడ జైల్లో పెట్టాల్సింది కదా కూన, ఎందుకు చేయలేధో? అంటే మీ నాయన చంద్రబాబు తో కుమ్మక్కు అయినాడా? చంద్రబాబు పైన 36 ఎంక్వయిరీ లు  వేసిన మీ నాయినకి ఈ కధ అప్పుడు తట్టలేదేమో… నీకో విషయం చెప్పాలి తల్లి, పెట్రోలియుం మరియు సహజ వాయువు నిక్షేపాలు కేంద్రం ఆదీనంలో వుంటాయి, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో వుండవు. వుంటే మీ నాయిన, అన్న వూరుకొనే వారా? దోచుకునేవాళ్ళు కదూ! మీరు పదేపదే వల్లెవేసే సమేత పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చ గానే కనపడుతున్నట్టు మీకు లోకంలో వుండే వారందరూ అవినీతి పరులుగానే కనపడుతున్నట్టు వున్నారు.

రాష్ట్రం ఇప్పుడున్న పరిస్తితికి కారణం మీ నాయనే కదా, ఇప్పుడున్న వాళ్ళు ఏమి చేయలేదనే నీ వాదన ఎంత సమంజసమో మీ నాయనే కారణం అన్నది కూడా అంతే సమంజసం. కాబట్టి మీరు ఏమి చెప్పినా ఈ జనాలు పిచ్చి పుల్లయలుగా వింటారులే అనుకోకుండా కొంచం వారిని గౌరవించండి. చంద్రబాబు యాత్ర వల్ల కనీసం ప్రజలు కష్టాలు సంబందిత అధికారులకన్నా చేరుతుంది, నీ యాత్ర వల్ల ఉపయోగం ఎవరకన్న వుందా? ఆలోచించండి!

Advertisements
Standard
రాజకీయాలు

బాబు @ 63ఏళ్ళ వయసులో, 600 కిలోమీటర్లు!

నమస్కారం,

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు 63 ఏళ్ళ వయసులో వస్తున్నా మీకోసం అంటూ మొదలెట్టిన పాదయాత్ర 600 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఆయనను అభినందించకుండా వుండలేను. ఆయన యాత్రకి వస్తున్న విశేష ఆదరణ, స్పందన చూస్తే ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో వున్న అసహనం ఎంతో తెలుస్తుంది. రెండు సార్లు యాత్రకి విజ్ఞాలు ఎదురైనా పట్టువదలకుండా నడుస్తూ ప్రజల కష్టాలు తెల్సుకుంటూ ముందుకు సాగుతున్న చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ….

వస్తున్నా మీకోసం పాదయాత్రలో వస్తున్న విజ్ఞప్తులు బుట్ట దాకలు కాకుండా సంభందిత అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం అధినేత హోదాలో సమస్య పరిష్కారం కోసం విజ్ఞప్తి చేయటం హర్షించదగినది. ఇంక ఆ సమస్య పరిష్కారంలో అధికారుల కృషి ఎంత అనేది మనం చెప్పలేనిది. చంద్రబాబుకి చెప్తే మాకేంటి ఒరిగేది అనుకునే వాళ్ళకి ఒక సమాధానంగా అనుకోవొచ్చు. చంద్రబాబు చేసే పాదయాత్రలో ఎంతో కొంత నిజాయితీ వుండబట్టే, ప్రాంతాలకి అతీతంగా జనాధరణ పొందుతున్నది. తెలుగుదేశం కార్యకర్తల్లో వున్న నిరాశా నిస్పృహలను ఒక్కసారిగా తన యాత్రతో వదిలించారు అధినేత, దీనితో ప్రత్యర్ధి పార్టీల్లో వొణుకు మొదలైన్దనేది పచ్చి నిజం. ఇంకేముంది కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, తెరాస పార్టీలు తెలుగుదేశం మీద పడి ఏడవటం మొదలెట్టాయి అంటే ప్రజలు తెలుగుదేశాన్ని విశ్వసిస్తున్నారని అర్ధం చేసుకోవాలి మనం.

చంద్రబాబు రోజుకు సుమారుగా 20కిలో మీటర్లు నడవటం గొప్పా? అని అడిగేవారికి నేను చెప్పేది ఒక్కటే. 63 ఏళ్ళ వయసులోని వ్యక్తి నడవటం ముమ్మాటికీ గొప్పే. అంతెందుకు మీరు శని, ఆది వారాల్లో ఇంట్లో వున్నప్ప్పుడు ఉదయం పది గంటలనుండి సాయంత్రం పది గంటలదాకా కూర్చోకుండా వరుసగా రెండు రోజులు పనిచేస్తే మీకు కలిగే అలసటకి సోమవారం పనికి వెళ్ళగలరా? వయసులో వున్న మీకే అంత నొప్పుంటే వయసు మీరిన ఆయనకు ఎంత కష్టం.

చివరిగా ఒక్కటి చెప్తాను, నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అనుకునే మనం, మన కుటుంబం వుండే సమాజం బాగుండాలి అని ఎందుకు కోరుకోము? మన బిడ్డల బాగుండాలి అని జీవితమంతా నానా తిప్పలు పడే మనము, రేపు వారుండబోయే ఈ సమాజం కూడా బాగుండాలి అంటే మనం స్వార్ధ ప్రయోజనాలు వదిలి ఒక్కసారి ఈ సమాజం, ఈ రాష్ట్రం గురించి అలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ… మీ హర్ష

Standard
రాజకీయాలు

నాయకుల టి.వి. చానెల్స్!

నమస్కారం,

రాష్ట్రంలో నాయకులూ సొంత టి.వి.చానెల్స్ ను ఏర్పాటు చేసుకొనే పనిలో వున్నట్టు వుంది! ఎవరేవరివో ఒకసారి తరిచి చూస్తే….

మొదటిది….. సాక్షి, ఇది ఎవరిదో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని పుట్టుకలో నీతి, నడకలో నీతి, చెప్పేది నీతి, రాసేది నీతి, యజమానులు నీతి అంత నీతి మయం. ఏంటి నమ్మకం కలగటం లేదా? అదేనండి వారు చేసిన అవినీతిలో “అవి”ని మయం చేసి “నీతి”ని మాత్రమే చూపించే చానెల్, మయం చేసిన “అవి”ని పక్కవాడి “నీతి” ముందు చెరిచి రాసే పొట్లాల పేపర్. వినేవాడు ఎర్రిపప్ప అయితే ఏమైనా చెప్పొచ్చు అని ఈ చానెల్ గొప్ప ఉదాహరణ. మొదట్లో తెలుగు దిన పత్రికలన్నీ ప్రజల దగ్గరనుంచి ఎక్కువ డబ్బులు వాసులు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు అని ఉదారగోట్టిన ఈ పేపర్ ఇప్పుడు అందరిలాగానే డబ్బులు వాసులు చేస్తుంది మరి ఇది కదా పిండటం !మొదట్లో అవినీతి సొమ్ము వుంది ఇష్టం వచ్చినట్టు చేసారు, ఇప్పుడు ఆ సొమ్ముకు బ్రేకులు పడ్డాయి, రెండోసారి బొక్కటం మొదలయ్యేదాక నడపాలి కదా!!! పిండిన్చికొనే ప్రజలు వున్నారు కదా ఎంతైనా పిండుకుంటారు. ఒక విషయం చెప్పాలి ఈ మధ్యన ఒక ఉద్యోగి ఇంటి ముందు సాక్షి పేపర్ పొద్దున్నుంచి సాయంత్రం దాక బయటే వుండటాన్ని గమనించి ఒక పెద్దాయన ఏంటి బాబు పేపర్ చదవని కాడికి ఎందుకు వేయిన్చుకున్తున్నావ్ అని అడిగితే సదరు ఉద్యోగి “మొదట్లో సంవత్సరం చందా చాల తక్కువ అని అంటగట్టారు, తరువాత నేను అ పేపర్ చదవలేక డబ్బులు కట్టటం మానేసాను అయినాగాని పేపర్ వేస్తూనే వున్నారు నన్నేం చేయమంటారు చెప్పండి” అని సమాదానం వచ్చిందంట. అవాక్కయ్యారా!

రెండోది… నమస్తే తెలంగాణా, టి న్యూస్. కెసిఆర్ గారి పార్టీ తెరాస పేపర్ మరియు చానెల్, పార్టీ ఆఫీసులోనే నడుపుతున్నారు. ఎంత చెప్పిన తక్కువే లెండి దీని గురించి అదేనండి వినేవారు తక్కువే, చదివేవారు తక్కువే. అన్నీ తక్కువైతే ఇంక నేను చెప్పేది ఏముంది.

మూడోది… జీ 24గంటలు, ఇది మన కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ బొత్స గారి దంట. మొదట్లో ఇది తెలంగాణా సపోర్ట్ చేసే చానల్ గా ముద్ర పడి దానిని తన దారిలో తెచ్చుకోలేక తన గురించి ఏమి చెప్పించుకోవలో అర్ధం కాక కొన్నందుకు ఉపయోగం లేక తల పట్టుకు కూర్చున్నాడంట.

నాలుగోది…. ఐ న్యూస్ ( అదేనండి ఎన్ టీవీ అనుబంద చానెల్) ప్రతోడికీ చానెల్ వుంది సి.ఎం. అయిన నాకు లేక నన్ను ప్రజలోకి తీసుకుపోవటంలేదు (తెస్కపోనేయ్ట్లేదు -సి.ఎం. గారి బాషలో) అని ఫీలయిన మన ముఖ్య మంత్రిగారు దానిని కొనేశారు.

అయిదోది…. సూర్య దిన పత్రిక, సాక్షి పెట్టిన కొత్తోలో తెలుగు దేశం తరుపున అని చెప్పుకుంటూ స్తాపించిన పత్రిక. తెలుగుదేశానికి ఎటువంటి సంబంధం లేదు అని తెల్సిన పాపం తెలుగుదేశం కి సపోర్ట్ అని చెప్పుకున్నా ఒక్కడన్నా చదివితే ఒట్టు. ఇది అసలు వుంది అని తెలుసుకోవటం కూడా కష్టమే, ఎక్కడా కనపడదు. దీని యజమానిని ఈ మధ్యనే ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ చేయించి జైలుకు పంపటానికి సహాయం చేసింది.

v6 న్యూస్ చానెల్… ఇది తెలంగాణా కాంగ్రెస్ ఎం.పి. వివేకది. ప్రతి సోది వార్తా వీరికి సెన్సేషన్ వార్తే. ఈయనగారి బాధ మొన్న మంత్రి పదవుల పదేరం అప్పుడు తెల్సింది.

ఈనాడు… మొదటి నుంచి తెలుగుదేశంకు పూర్తి మద్దత్తు ప్రకటించి తెలుగుదేశం పత్రిక అని ముద్ర వేసుకున్నా రాష్ట్రం లో ఎక్కువమంది చదివేది దీన్నే. మద్దత్తు ఇచ్చినా అడ్డగోలు రాతలు కనిపించవు. కొంచం పాత్రికేయ విలువలు పాటించే ఏకైక తెలుగు దిన పత్రిక.

ఆంధ్రజ్యోతి… అందరూ చంద్రబాబు పేపర్ అంటే రాధాకృష్ణ గారు ఇది నా పేపర్ అని నెత్తి నోరు బాదుకున్నా ఎవడూ వినడు. సంచలనాలు కావాలి అంటే ఆంధ్రజ్యోతి చదవాల్సిందే. సంచలన మాయలో పడి పాత్రికేయ విలువలు కొన్ని మర్చిపోయారు వీరు. తెలంగాణాకి సపోర్ట్ ఇస్తారు కానీ తెలంగాణా వారు వ్యతిరేకం. తెలుగుదేశం పేపర్ కాదు, తెలుగుదేశం కి వ్యతిరేకంగా రాస్తారు కానీ తెలుగుదేశం వారు చదువుతారు. న్యూస్ చానెల్ బాగా పాపులర్ కానీ ఎ ఒక్క డి.టి.ఎచ్. లోను రాదు. మంచి చెప్తారు, కానీ ఎవరూ వినరు. జనానికి కావాలి కానీ అందుబాటులో వుండదు. ఏంటో…

టీవీ9… రవిప్రకాష్ పెద్దోడు అవటం దీనికి గ్రహణం పట్టి బంక చానెల్ గా, డబ్బులు తీసుకోని వార్తలు చెప్పే చానెల్ గా పేరు సంపాదించినది. ఒక్క న్యూస్ దొర్కితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే. పొద్దున నుంచి మరలా న్యూస్ దొరికేదాకా డప్పు వాయిస్తనే వుంటారు. అందుకే అనేది అంటుకుంటే వదలదు అనేది.

ఎంత చెప్పిన తరగదు కానీ, నిజాలు చెప్పే వారిని మనం నమ్మము కాబట్టి మీకు నచ్చిన చానెల్ చూస్తూ ఎంజాయ్ చేయండి కానీ నమ్మోదు. నిజం వారికీ అవసరమైనంత వరకే వుంటుంది, మిగిలింది మనల్ని నమ్మించే కధే.

Standard