రాజకీయాలు

ఏరు దాటాక తెప్ప తగలేసే జంప్ జిలానీలు! – పార్ట్ 1

అందరకీ నమస్కారం…

ఇటీవల ప్రవీణ్ రెడ్డి అనే తెలుగుదేశం ఎం.ఎల్.ఎ. పార్టీ నుండి సస్పెండ్ అయ్యి వెంటనే ఆయన తండ్రుల కాలం నుండి నమ్మకంగా వుంటూ రాజకీయ బిక్ష్ పెట్టిన తల్లి లాంటి పార్టీని వదలటం కరెక్ట్ అని చెప్పుకోటానికి ప్రెస్ ముందుకు వచ్చి చాల పెద్ద తప్పు చేసారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ఇంతవరకూ నాకు పెద్దగా తెలియదు, ఎందుకు పార్టీ మారారో తెల్సుకుందాం అని టీవి చూసాను. ఆయన చెప్పినదాన్లో ఇసుమంతైనా నమ్మకం కుదరలేదు. ఆయన చెప్పిన రెండు విషయాల్లో

మొదటది తెలుగుదేశం కాంగ్రెస్ తో కుమ్మక్కు అయిందని… దానికి ఆయన చెప్పిన సాకు చిత్తూరు జిల్లా ఎం.ఎల్.సి. ఎలెక్షన్లో ఆయనగారిని కాంగ్రేస్స్ వారిని గెలిపించండి అని చంద్రబాబు చెప్పారంట, అది ఈయనగారు పాటించారు, పాటిస్తే కాంగ్రెస్ గెలవాలి కదా మరి ఎందుకు గెలవలేదు. ఆయన ఆత్మ క్షోభిస్తే అప్పుడే రాజీనామా చేసి విశ్వసనీయత నిరూపించుకుంటే బాగుండేది కానీ ఆయన అల చేయలేదు. ఎందుకంటే అక్కడ జరిగింది వేరు ఆయన సహాయం చేసింది ఆయన ప్రస్తుత పార్టీకి అందుకే అక్కడ తెలుగుదేశం గెలవలేదు, కాంగ్రెస్ గెలవలేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది ప్రవీణ్ ప్రావిన్యమే గాని తెలుగుదేశం కాదు. తెలుగుదేశం అంట కాగేది ప్రజలతో గాని కాంగ్రెస్ తో కాదు నాయనా, అది చేసేది పిల్ల కాంగ్రెస్.

రెండోది తెలుగుదేశం తెలంగాణాకి అనుకూలంగా వుందని.. 2009లో ఫార్మ్ హౌస్ పార్టీ అదేనండి తె.ర.స తో పొత్తు పెట్టుకున్నప్పుడు గుర్తుకు రాలేదా సమైక్యంద్ర నినాదం. అప్పుడే బి.ఫారం తీసుకోకుండా వుండాల్సింది. తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవిస్తాం మేము తెలంగాణా కి అనుకూలం అని చంద్రబాబు చెప్పటం తప్పయితే మరి ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ చెప్పేది కూడా అటు ఇటు తెరగేసి చంద్రబాబు చెప్పిందే చెపుతుంది కాని మరో భగవద్గీత ఏమి కాదు కదా ప్రవీణ్ సారూ. మరి అ పార్టీ లోకి ఎలా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో అర్ధం చేసుకోలేని ప్రజలు ఇక్కడ ఎవ్వరూ లేరు.

కాబట్టి, మీ సొల్లు పురాణం ఇక్కడ వినటానికి ఎవరూ లేరు. ప్రజలు ఏమైపోతే మీకేంటి, నమ్మి పెద్దోడిని చేసిన పార్టీ ఏమైపోతే నీకేంది, మీకు రావలసిందని వచ్చేలా చూసుకొని మీరు బాగుపడండి ప్రవీణ్ రెడ్డి సారూ.

Advertisements
Standard
జనరల్, రాజకీయాలు

నాకేంటి లాభం…?

నమస్కారం,

చదువుకున్నవారు విద్యతో పాటు సంస్కారం, విజ్ఞతతో ఆలోచించే శక్తిని పొందుతారు. కాని ఇప్పుడు సమాజంలో (ఇక్కడ అందరితో పాటు నేను కూడా ఈ సమాజంలో భాగంగా భావిస్తూ) ఆలోచన ధోరణిలో మార్పుని గమనిస్తుంటే వింతగా భయం వేస్తుంది. సమాజం గురించి ఆలోచిస్తే నాకేంటి లాభం( దానినే QUID PRO QUO అని కూడా అంటారు) అని అడుగుతున్నారే కాని వీరు కూడా ఆ సమాజంలో భాగం అని అర్ధం చేసుకోవటం లేదు . ఒకవేళ వారు ఇంట్లో వారితో కూడా అలానే ఆలోచిస్తారేమో, అల చేయని పక్షంలో సమాజం గురించి ఎందుకు ఆలోచించరోఅర్ధం కావటం లేదు.

నాకు తెలిసిన ఒక వ్యక్తి సమాజంలో చాలా పరపతి వున్న వ్యక్తి, అందునా చాలా భాద్యతాయుతమైన స్థానంలో వుండి కూడా రేపు సమాజంలో బతకాల్సిన నాలాంటి వ్యక్తితో –  నువ్వు డబ్బు నీతి నిజాయితితో సంపాదించవలసిన అవసరం లేదు, బాగా డబ్బు సంపాదిస్తే సమాజం నిన్ను గౌరవంగా చూస్తుందని చెప్పగానే మతి పోయింది. సమాజంలో నీతికి నిజయతీకి విలువలు లేవా? ఇప్పుడిప్పుడే సమాజం అందులో నా భాద్యతని తెల్సుకునే సమయంలో నలుగురికి మంచి చెప్పాల్సిన స్తానంలో వున్న వ్యక్తి ఇలా ఎలా మాట్లాడతారు. నాకేమి అర్ధం కాలేదు.

వయసులో నాతోటి వ్యక్తి, ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. అతనికి సమాజంలో జరిగే అవినీతి విషయాలు చెప్పి, వాటిని నేను ప్రోస్తాహించలేను, వారికీ  నా వొంతు సహాయ సహకారాలు అందించలేను అని అంటే సదరు వ్యక్తి ” ఇలా అయితే మనం ఇక్కడే వుంటాము, నీతి నిజయతిల గురించి పట్టించుకోకుండా వారితో కలిసి ముందుకు పోవాలి లేక పోతే మనం వెనకుండి పోతాము” అనగానే నాకేమి మాట్లాడాలో అర్ధం కాలేదు. రక్తం వుడుకుతున్న వయసులో వుండి కూడా ఏమైంది ఆ యువకునికి.

ఇక్కడ మీకు సమాజంలో ఎక్కువ ప్రభావం చూపగలిగే రెండు వక్తిత్వాలు, ఒక కుటుంబంలో ముఖ్యమైన కుటుంబ పెద్ద మరియు రేపు సమాజంలో ఒక కుటుంబానికి కాబోయే పెద్ద. వీరిద్దరి ఆలోచనలు ఇలా వుంటే రేపు మనమందరమూ కల్సి వుండాల్సిన ఈ సమజం ఎలా వుంటుందో మీకు అర్ధం అయ్యే వుంటుంది. మీలో చాలామంది ఆ రెండు వ్యక్తిత్వాల స్తానంలోకి వచ్చినవరున్నారు, రాబోయే వారున్నారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో వారితో నాకేంటి లాభం నీకు తిండి పెడితే అని ఆలోచిస్తే ఎంత జుగుప్సాకరంగా వుంటుందో అలానే మీరు సమాజంతో కూడా నాకేంటి లాభం అంటే అంతే జుగుప్సాకరంగా వుంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి.

నేను డబ్బు సంపాదిన్చొద్దు అనటం లేదు, సంపాదించేది నీతి నిజాయితీతో సంపాదించండి. యువకులు చేతినిండా సంపాదిస్తే సరిపోదు, మీ కడుపు నిండగానే సమాజం గురించి ఒకసారి ఆలోచించండి మంచి చేయక పోయినా పర్లేదు కాని చెడుని మాత్రం ప్రోత్సహించ్చొద్దు. మీరు సంపాదించే ప్రతి పైసా ఈ సమాజం మీకు ఇచ్చినదేనని మాత్రం గుర్తుంచుకోండి. నేను ఆలోచిస్తున్నాను మరి మీరు…

 

Standard
రాజకీయాలు

లోగుట్టు ఈశ్వరునికేరుక….!

అందరికీ నమస్కారము, చాల రోజుల తరువాత మీ అందరినీ పలకరిస్తున్నందుకు చాల సంతోషంగా వుంది. కాని రాష్ట్రం పరిస్తితి….

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకనిపించిన మాట “లోగుట్టు ఈస్వరునికేరుక…“.  ఎందుకంటే

అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన బాబు “మీ కోసం వస్తున్నా…” పాదయాత్ర మొదలై విజయవంతంగా 100కిలోమీటర్లు దాటి ముందుకు సాగుతుంది. ప్రజలు బాధల్లో వున్నారు, అది ఎంత నిజమో చంద్రబాబు పాదయాత్రకి వస్తున్న విశేష స్పందన చూస్తే తెలుస్తుంది. ఈ పాదయాత్రలో ప్రజలు కష్టాలు తెల్సుకొని వాళ్ళ తరుపున పోరాడి ప్రభుత్వం మేడలు వంచి పరిష్కరించటానికి ప్రయత్నిస్తే ఈ పాదయత్రకి ఒక అర్ధం పరమార్ధం  వుంటుంది, అంతే కాని ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఈ బాధలు బరించండి తరువాత మేము అధికారంలోకి వచ్చి మీ భాధలు తీరుస్తాం అంటే అది ఎంత మాత్రం అమోదోగ్యం కాదు. అంతిమంగా ఈ పాదయాత్ర ఉద్దేశం మాత్రం తెలుగుదేశం అధికారంలోకి రావాలి చంద్రబాబు CM అవ్వాలి. ఇది ఎవరు అవునన్నా కాదన్నాపచ్చి నిజం. ఇప్పుడున్న పరిస్తితుల్లో రాష్ట్రానికి అది అవసరం అని తెలుగుదేశం కార్యకర్తలు, రాష్ట్రం మీద అభిమానం వున్న వారి వుద్దేశం. ఎవరి ఉద్దేశాలు వారివి, ఎవర్ని కాదనగలం.

చంద్రన్న చంద్రయాన్ విజయవంతం అయ్యేసరికి, విపక్షంలో వున్న మరో పార్టీకి అదేనండి ఎడతెగని ఓదార్పు యాత్ర చేసే పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యింది. పుండు మీద కారం జల్లినట్టు వారి నాయకుడికి బెయిలు రాక పోవటం, చంద్రబాబుకు వస్తున్న ఆదరణ, ఆ పార్టీ నాయకుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇంకేముంది చంచలగూడ జైల్లో పార్టీ  మీటింగ్, చర్చల మీద చర్చలు.

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చలి కాచుకోవటానికి భలే మంటేశావు అన్నాడంట వుకొకడు…

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దత్తు ఇచ్చినా ED ఆస్తులు స్వాదీనం చేసుకోవటం, కోర్టులో బెయిలు నిరాకరణ, పూర్తి విచారణ జరిగేదాకా బెయిలు అడగొద్దని సుప్రీం కోర్ట్ హుక్కుం. బెయిలు నిరాకరించిన మరుసటి రోజే ED తనికీలు, దానికి తోడు చంద్రబాబు యాత్ర విజయవంతమవటం. చీకటి వొప్పందం బయట చెప్పుకోలేరు కాబట్టి JAGUAR కారులో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి దగ్గర తాడో పేడో తేల్చే పంచాయతీ, మరి ఏమి జరిగిందో కాని మరలా ఓదార్పు యాత్ర మొదలు పెట్టాలని యోచనంట్ట.

అన్నిటికి తారక మంత్రం ఎడతెగని ఓదార్పు యాత్రే  – ఇది ఎప్పటిదాకా అంటారా మరల బెయిలు వచ్చేదాకనుకోండి. ఒకే దెబ్బకు అనేక పిట్టలు అన్నట్లు – పొట్లాల పేపర్ నింపటానికి మంచి అవకాశం, జనాలని తరలించి మాకూ జనాలు వస్తున్నారు అని చెప్పుకోటానికి, కాంగ్రెస్ ని ఏకటానికి… మరిచిపోయాను అందరికీ  ఉమ్మడి శత్రువు చంద్రబాబుని, TDPని టార్గెట్ చేయటానికి. ఎందుకంటే వీరందరూ (TRSకి, CONGRESSకి, YSRCPకి) ఒక గూటికి చెందినవారే కదా!  వీరి లోగుట్టు మనకు తెలియదా?

Standard