రాజకీయాలు

ఎగిరిన తెల్ల జెండా…!

నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు నమస్కారములు…

ఒక యుధం చేసే యోధుడు తెల్ల జెండా ఎత్తితే అది సయోధ్యకు చిహ్నంగా ఎలా భావిస్తామో,  అలాగే మన రాష్ట్రంలో కూడా తోటి రాజకీయపార్టీతో యుధం  చేయాల్సిన రాజకీయపార్టీలు వాటి స్వలాభం కోసమో లేక ఇతర అవసరాల కోసమో లేకపోతే బలం పుంజుకోవటం కోసమో కాడేను వదిలి తెల్ల జెండాలు పట్టాయి. ఒకింత ఆశ్చర్యంగా వుంది కదా? నాకు తెలిసిన కొన్ని విషయాలు గురించి మీతో పంచుకోవాలనిపించి…

1. కాంగ్రెస్……  రాష్ట్రపతి ఎన్నికలు సందర్భంగా అనుక్షణం ఒకరినొకరు తిట్టుకుంటూ వుండే తెలంగాణ, సీమ ఆంధ్రా కాంగ్రెస్ ఎంపిలు ఒకరినొకరు కౌగిలించుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా పలకరించుకుంటూ ఫోటోలకు ఫోసులు ఇస్తుంటే ప్రతి తెలుగువాడు ఆశ్చర్యంగా నోళ్ళు వెల్లబెట్టుకొని చూస్తుండిపోయారు. అంత కంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. ఇది పూర్తిగా సొంత పార్టీ వ్యవహారం కాబట్టి తప్పు బట్టల్సినదేమిలేదు, కాని వారి కలయికలో తెలంగాణా ప్రాంతపు ప్రజలు కాని, వారి ఆశయ సాధన కాని తెలంగాణా ఎంపిలకు గుర్తుకురాకపోవటం కడు శోచనీయం.

ఎలాంటి రాజకీయల వల్ల ఆంద్ర రాష్ట్రం గత పది సంవత్సరాలుగా నష్టపోతుందో అలాంటి రాజకీయాలు మాత్రమే చేసే కాంగ్రెస్ నాయకులకి ఏమి చెప్పగలం,ఇలాంటి వారిని మనకు, మన రాష్ట్ర సంపాదకు జవాభుదారిగా వుండమని ఓట్లు వేసి గెలిపించి ఎన్నుకున్నందుకు… మనకు ఈ శాస్తి జరగాల్సిందే.

2. తెలుగుదేశం….. పుండు మీద కరం చల్లినట్టు  అసలే ఉప ఎన్నికల్లో ఓడిపోయి పార్టీ నానా తంటాలు పడుతుంటే, నందమూరి <–> నారా వారి కుటుంబ కలహాలు రచ్చకెక్కి పార్టీ పరిస్తితి అంతకంతకూ దిగజారిపోవటం గ్రహించిన చంద్రబాబు తెల్ల జెండా ఎత్తేసి నందమూరి వారితో సంప్రదింపులు మొదలెట్టారు. అసలు వారసత్వ రాజకీయాలకు దూరం అని చెప్పే చంద్రబాబు గత కొంత కాలంగా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం కోసం జరుగుతున్న ప్రకటనలను కండించకపోవటంతో ఈ రచ్చ మొదలైంది. ఈ సమస్యకు ముఖ్య కారణం చంద్రబాబు అవలబించిన వైకిరి అని మాత్రం గట్టిగా చెప్పగలను. అలా అని నందమూరి వారి తప్పు లేదని నేను అనను, పార్టీ పరిస్తితిని అర్ధం చేసుకొని అండగా నిలవల్సింది పోయి పుండును ఇంకాస్త కెలికి పార్టీని సర్వనాశనం చేసి వారు ఏమి బావుకు తిందాం అనుకున్నరో నాకు అసలు అర్ధం కావటం లేదు. నందమూరి వారికీ నారా వారి నాయకత్వంపై నమ్మకం లేకపోతే నారా వారు నందమూరి వారి దగ్గరనుంచి పార్టీని ఎలా లాక్కున్నారో అలాగే మీరు లాక్కోండి, కార్యకర్తలు తప్పకుండా సపోర్ట్ చేస్తారు అంతేకాని తమకు చెందిన MLAలను వేరే పార్టీలోకి పంపే శికండి రాజకీయాలను మాత్రం ఏ కార్యకర్తా ఒప్పుకోడు, సహించడు. కర్మ సిదంతాన్ని నమ్మే నందమూరి వారు కార్యకర్తలు అనుభవించిన మానసిక క్షోభను ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుభవించక తప్పదని ఎప్పటికి గ్రహిస్తారో?

ఈ విషయం వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరగటం లేదు అని అనను., ప్రధాన ప్రతి పక్షంగా వున్న తెలుగుదేశం ప్రజల పడుతున్న కష్టాలు గురించి పోరాడాల్సిన సమయంలో  తన ఇంటిని సరిదిద్దుకోవలసి రావటం మన కర్మ. దానికి జాలి పడటం తప్పించి మనం చేయగలిగింది ఏమీ లేదు.

3. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ….  అన్ని పార్టీలు కంటే పెద్ద తెల్ల జెండాను ఎగరేసింది ఈ పార్టీ, ఇంక ఇప్పుడల్లా తమ అవినీతి నేతకు బెయిలు కూడా రాదని గ్రహించారేమో ఆ పార్టీ వారు ఒక్కసారిగా కాంగ్రెస్‌కి జై కొట్టారు. పార్టీ  ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి  కాంగ్రెస్‌కు మాకు శత్రుత్వం లేదు, మా నాయకుడిపైన పెట్టిన కేసులకి కాంగ్రెస్‌కి ఎటువంటి సంభందం లేదు అని నొక్కి వక్కాణించి, ప్రణబ్ ముఖర్జీకి వోటు వేయాలని నిర్ణయించేసిన ఆ పార్టీ MPలను, MLAలను ఏమనాలి. కాంగ్రెస్ అధిష్టానం వారి మహానేతను చంపించ్చింది అని ఊదర గొట్టినవన్నినిజాలు కావనమాట, వారి స్వామి స్వకార్యం కోసం రాజకీయ వ్యభిచారానికి తేర లేపింది ఆ పార్టీ నాయకత్వం. ఒక భార్య తన భర్తతో సంసారం చేయలేక విడాకులు తీసుకొని మరలా అదే వ్యక్తితో సంసారం చేయటాన్ని ఏమనాలి? రాజకీయంగా సామాజికంగా పునర్జన్మనిచ్చిన పార్టీని కాదని కొత్త పార్టీ పెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ మరలా వారితోనే లోపాయకారి సంభందం ఎలా పెట్టుకుంటారు?  మీరే చెప్పండి.

మేము ఏమి చేసిన ప్రజలు మాకే ఓట్లు వేస్తారనే ధీమా కలిగిన నాడు, ఈ రాజకీయ పార్టీ ప్రతి అవసరానికి తెల్ల జెండాలు లేపుతూనే వుంటుంది , ప్రజల యొక్క నమ్మకాన్ని తాకట్టు పెడుతూనేవుంటుంది.

వీటన్నిటినీ సరిదిద్ధాలంటే ,తెలుగు వారందరూ విజ్ఞతతో ఆలోచించాలి అప్పుడే మనకు మన భావితరాలకు మంచి చేసిన వారమౌతాము. ఆలోచిస్తారని ఆశిస్తూ మీ హర్ష.

Advertisements
Standard
రాజకీయాలు

ఏందిది నాని అన్నా…?

నాని అన్నా నమస్తే,

కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు అలియాస్ కొడాలి నాని, మా ఇంటిపేరు కూడా అదే అయ్యేసరికి అందరు మీకు బంధువా అని అడిగేవారు, నాకు తెలిసి ఏమి సంభందం లేక పోయినా కొంచం బాగా అనిపించి మీ మీద ఏదో తెలియని అభిమానం పెరిగింది.

ssc చదివిన నువ్వు తారా జువ్వలాగా ఎదుగుతుంటే అబ్బో మా నాని అన్న సూపర్ అనుకున్నాను.

బస్సులు తిప్పుకునే నువ్వు జూనియర్ ఎన్టిఆర్ తో సినిమా తీస్తే కేక అనుకున్నాను.

పైన చెప్పినవన్నీ నీ జీవితంలో ఎలా, ఎందుకు జరిగాయో తెలుసా, మూడు అక్షరాల వల్ల అవి  N.T.R( స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు). ఇది నిజం, అ మూడు అక్షరాలే నిన్ను ఇంత దూరం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నడిపించాయి. నిద్రలో కూడా మరచి పోకూడని ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోవటానికి ట్రై చేస్తున్నావ్, శెభాష్ అన్నా.

నెల విడిచి సాము చేస్తున్న నిన్ను చూసి ఎలా నవ్వాలో అర్ధం కావటం లేదు. అలా ఎందుకు అన్నానంటే…

1. నీకున్న MLA గిరిని చూసి నువ్వు ఆడుతున్న నాటకాలన్నీ కేవలం ఆ మూడు అక్షరాల వల్లే….                                                                                2003 లో సిట్టింగ్ కాదని నీకు ఇచ్చింది, ఆ ఎదురు గాలిలో కూడా నిన్ను ప్రజలు గెలిపించింది నీ SSC పట్టా చూసి కాదు, అప్పటికి నువ్వు చేసిన సమాజ సేవ చూసి కాదు, నీ డొక్కు సిటీ బస్సులు చూసి అంతకన్నా కాదు, ఆ పెద్దాయన అభిమానివి అని నీకు ఓట్లు వేసి గెలిపించి నిన్ను పెద్దోడిని చేసారన్న. 2009 లో అందరితోపాటు నిన్ను కూడా గెలిపించింది, మాకు నువ్వొక పెద్ద దిక్కు అవుతావని. కానీ మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసావుకదన్నా. ఇంత అన్యాయం చేయటానికి నీకు మనసేల వచ్చింది? లేక నీ కొత్త గురువు నేర్పించాడా?

2. ఆయన కొడుకుకి, మనవడికి నువ్వు అ పెద్దాయన అభిమాని అని చెప్పుకోవటం వల్లే దగ్గరయ్యవు….                                                                       NTR అభిమానివి కాబట్టి హరికృష్ణ దగ్గరికి తీసాడు, ఏమి ఆశించకుండా జూనియర్ వెన్నంటి వున్నావు కనుక జూనియర్‌ను అభిమానించే అందరూ నిన్ను కూడా అభిమానించారు, కానీ కొడాలి నాని అని ఒక వ్యక్తీ చూసి కాదు. NTR అభిమానులందరూ హరికృష్ణను, జూనియర్ ను ఎలా అభిమానించారో అలానే నిన్ను కూడా అభిమానించారు కనుకనే నువ్వు ఇప్పుడు ఈ స్తానంలో వున్నావు, అందుకే అంటున్నాను అన్నిటికీ మూలం NTR… ఆ మూడక్షరాలే.

3. మేము నిన్ను గుడ్డిగా అభిమానించింది కూడా నువ్వు ఆ పెద్దాయనకు ఏకలవ్య శిష్యుడివని చెప్పుకున్నందుకే….                                                     NTR  అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటినుంచి ఆ పార్టీ జండాను బుజాన వేసుకొని ఏమి ఆశించకుండా ఇప్పటికీ ఆ కార్యకర్తలు ఎందుకు మోస్తున్నారో తెలుసా…  ఇప్పటికీ ఆ పార్టీ కాడర్ చెక్కు చెదరకుండా, ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ తల ఎత్తుకొని ఠీవిగా ఎలా నిలబడగలుగుతున్నారో తెలుసా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ప్రాణాలు పోతున్నా, ప్రాణాలు తీసినా, ప్రాణాలు తీస్తాం అని బెదిరించినా, పట్టిన జెండా దించకుండా మీలాంటి వాళ్ళని బుజాలకేత్తుకొని ఎందుకు పెంచి పోషిస్తున్నారో తెలుసా, ఆయన మీద వున్న అభిమానం, గౌరవం వల్లే. ఇప్పటివరకూ ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేద్దామనుకున్న వాళ్ళంతా నామరూపాలు లేకుండా పోయారు. అలాంటి వారి దరి చేరి నిన్ను పెద్దోడిని చేసిన కార్యకర్తల మనోభావాలని ఎలా కేలకాలనిపించింది అన్నా.

నీకు రాజకీయ బిక్ష పెట్టిన హరికృష్ణ, జూనియర్ లాగా కట్టే కాలేవరకు తెలుగుదేశంలో వుండాలి లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటేనే, నీకు NTRగారి మీద వున్నది నిజమైన అభిమానంగా గుర్తించబడుది లేదంటే నువ్వు చేసింది ముమ్మాటికి ద్రోహమే. దానిని ఏ కార్యకర్త క్షమించడు.

నిన్ను తీసుకువచ్చి కార్యకర్తల బుజాన కూర్చోబెట్ట్టిన జూనియర్ నాకు సంభందం లేదు అంటే సరిపోదు, కార్యకర్తలకు మానసిఖంగా కలిగిన బాధని ఎవ్వడు తీరుస్తాడు. నాకు ఇప్పుడే  రాజకీయాలు వొద్దు, నాది చాలా చిన్న వయసు అనుకునే వాడు నిన్ను ఎందుకు తీసుకువచ్చినట్టు. తీసుకొచ్చిన పాపానికి ఆ సీటుని మరలా అతనే గెలిపించి తీసుకురావాలి, లేక పోతే ఇకనైనా రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకుంటే మంచిదని. తను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావలనుకున్నప్పుడు మాత్రమే సీట్ల గురించి పట్టిచుకుంటే అప్పటినుంచైనా కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండా వుంటాయని నా అభిప్రాయం.

Standard
రాజకీయాలు

అరాచకం

Harsha

మిత్రులకు నమస్కారం,

మాది ఒక చిన్న పల్లెటూరు, నా చిన్నప్పుడు మా ఊరి పొలాల్లోకి ఎటు చూసిన పచ్చటి మాగాణి పొలాలు కనిపించేవి. మాది ప్రకాశం జిల్లా గొప్ప చరిత్ర కలిగిన కృష్ణా డెల్టా చివరి భూములు, అంటే మా తరువాత మిగిలిన నీరు సముద్రంలో కలుస్తాయి అనమాట(అది నేనెప్పుడు చూడలేదు). మాకు నాగార్జునసాగర్ కుడి కలువ నుంచి వచ్చే నీటిని చివరగా వాడుకుంటాము, కొంత భూమి ప్రకాశం బేరేజి కుడి కాలువ నుంచి వచ్చే నీటితో ఒక పంట పండించే భూములు మావి. అది పాతిక సంవస్తరాల క్రిందటి మాట, కాని ఇప్పుడు వచ్చే అరకొర నీటితో ఒకప్పటి మగాని భూముల్లో మెట్ట పంటలు సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నాము.

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2004లో 1/06/2004న విడుదలైన G.O – 53 మరియు 2005లో 11/01/2005న  G.O – 5, 2/03/2005న G.O – 108 జారీ చేసింది ప్రభుత్వం. ఈ G.O లు ఏమిటి ఎందుకు అనుకుంటున్నారా, అది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సంభందించినవి. దీనివల్ల కడపలో లక్షన్నర ఎకరాలు, చిత్తూరులో లక్ష ఎకరాలు మరియు నెల్లూరులో 15వందల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి అని అధికారిక లెక్కలు. ఇంతవరకు అంత బాగానే వుంది. మరి నీరు ఎక్కడనుంచి ఇస్తారు అని చూస్తే శ్రీశైలం డ్యామ్ లో నిండగా వచ్చే నీరుని ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ జిల్లాలకు తరలిస్తారు. అంటే…

View original post 342 more words

Standard