రాజకీయాలు

అగ్గితోటి కడుగు… ( by అరుణ్ సాగర్ )

వేరార్ యూ శాస్త్రీ. నువ్వు అరెస్సెస్ వాడివో ఆర్ ఎస్ యూ వాడివో లేక మామూలు సెంట్రింగ్ చేసుకునే వాడివో కానీ మొత్తానికి నువు చెప్పింది ఇరవై ఏళ్లయినా నిప్పులాంటి నిజంలానే మిగిలింది. నిజమేనన్నా వీళ్లకి సిగ్గులేదు. బుర్రలేని వెర్రి గొర్రెలు, పొలోమని గుద్దేయడం అలోమని ఏడ్చేయడం , చిన్నప్పట్నుంచి చూస్తున్నం కదా. చారానాకీ ఆఠానాకీ కన్నీళ్లకీ చెంపనిమురుళ్లకీ కులానికీ మతానికీ వారసత్వానికీ కాసిని సారాచుక్కలకీ. నువ్వేనా అవినీతి రక్కసి కోరలు పీకి కాళీయ మర్ధనం చేసిన కిష్టుడి ప్లేసులో నిన్ను నువ్వు ఊహించుకుంది. మనమేనా అన్నాహజారే వస్తే లాఖో లాఖోమే జమయి జైకొట్టింది. సిటీ వీధుల్లోంచి సైబర్ ఆకాశదారుల వరకూ ఒక్క నినాదమై హోరెత్తించింది. ఇంకేముందిరా జాతి జాగృతమైపోయింది.

రామ్‌లీలా మైదానంలో సాగిన సమరశీల విన్యాసాలకు ఒళ్లు పులకరించిపోయింది. తండ్రీ ఇన్నాళ్లకు కనిపించావా, ఎక్కడ అవినీతి వేళ్లు దేశపు న్యాయ, రాజకీయ, ఆర్థిక, పాలక వ్యవస్థలలోనికి పాతుకుపోలోవో అక్కడికి నా దేశాన్ని మేల్కాంచావని మురిసిపోలేదా . నేనూ నా దేశం స్వతంత్ర భారతదేశం . ఇక నీతికి నిలబడి నిజాయితీగా ప్రగతి పాట పాడుకుంటూ ముందుకు పోతుందని ఎగిరెగిరి గంతులేసి విజిలేసినోళ్లలో నువ్వూ ఉండే ఉంటావు కదా. ఎంతటి వెల్లువ. ఎంతటి ఆగ్రహం. అవినీతిభూతాన్ని నిలువునా ముక్కలు కోసి ఉప్పుపాతరేయాలన్నంత ఆవేశం.

ఈజిప్టు లిబియా టునీసియా యెమెన్ స్పెయిన్ దేశాల్లో రెక్కవిప్పిన కొత్త విహంగాలను చూసి పడటిగాలి తెమ్మరల్లో నువ్వూ నేను మైమరచి మంచి రోజులకు జెండా కర్రలమై వెల్‌కమ్ చెప్పి… ఇంత తోలు మందం గాళ్లమా బ్రదర్. కొంచెమైనా స్ఫూర్తి లేదు కదా. గుండె రగిలిపోతున్నది. ఇంతటి మోసమా. సిగ్గు విడిచి బట్ట లిప్పి రెయిన్ డాన్స్ చేసి నిజాయితీని నిలువెల్లా వెటకారం చేసి. వాడు ఖజనా కొల్లగొడితేనేమిరా నీకు కొన్ని చిల్లర నాణెములు విసిరెను కదా.

ఇంతకీ ఉద్యమం కేవల నినాద ప్రాయమా. స్కూల్లో కాలేజీలో ఎలక్యూషన్ కాంపిటీషన్‌లో వ్యాసరచన పోటీలో సామాజిక రుగ్మతలపై ప్రసంగించి, పెన్ను ప్రయోగించి… ఐడియల్స్! హుహ్- ఒక వైరాగ్యభరితమగు పేల్ చిరునవ్వు నీ ముఖ కండరాలను మెలిపెట్ట లేదా? ఇన్ని చేసినోడివి, బాపూ మాకు అవినీతిని గెలిచే బలమీయలేకపోయావా . ఏం చేసుకుందాం రా అన్నా ఈ దిక్కుమాలిన తొక్కలో స్వాతంత్య్రాన్ని ఈ దొంగ దొరల పాలైన ప్రజాస్వామ్య సౌధాన్ని.

ఏం వాడు సంపాదించుకోలేదా. ఏం వాడు మాత్రం తక్కువ మెక్కాడా. ప్రభూ ( అంటే రాజు కాదు దేవుడు, పైనున్న దేవుడు) ఈ పంది కొక్కుల రాజ్యములో చివరకు సైజు కూడా పట్టించుకోడం లేదా!పోనీ పెద్ద పందికొక్కులకూ చిన్న పంది కొక్కులకూ తేడా చూడమని కూడా అడగలేమా. అంతకంటే దిక్కులేక!

ప్రథమ పౌరుని సంగతేమో గానీ అధమ
పౌరుని స్టాంపింగ్ మాత్రం పడిపోయినది. వీసా గ్రాంటెడ్! అవినీతికి సామాజిక ఆమోదము లభించినది. ఇక చేస్కోండి గురూ చూస్కోండి. అవినీతి మురుగుకాల్వలో ఈతలు కొట్టండి . మీ నీతీ నిజాయితీలను పక్కన పెట్టండి . ఒకరి వీపులు ఒకరు గోకుకొనుడు. పరస్పర మేళ్లు జరుగును. ఎవడూ ఏం పీకలేడు. ఏ చట్టమూ పట్టు బిగించలేదు. బిగించినా ఏ పట్టాభిరాముడో కట్లు విప్పక పోడు. కొందరిప్పుడు దుఃఖపడుతున్నారు.

వాళ్లలో ఎప్పుడో ఈ నీతిమాలిన మాఫియా లోకాన్ని ఎడంకాలితో తన్ని వెళ్లిపోయిన పాతనేతలున్నారు. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులున్నారు. ఆకాశంలోంచి దుఃఖం ధారలుగా కురుస్తోంది. అవినీతి వ్యతిరేక పోరాటంలో నేలరాలిన కార్యకర్తల కన్నీరది. ఘనులూ మధ్యములూ రోడ్డు రోలర్లతో తొక్కిస్తే చచ్చిపోయిన యాక్టివిస్టుల రక్తకన్నీరది. సమాచార చట్టం ప్రయోగించినా దొరకని మృతదేహాల ఆత్మల అశ్రుధారలవి.

ఫ్యూఢల్ పుత్రులు.బానిస బ్రతుకులు. రక్తంలో నరనరానా! నాలుగు బిస్కెట్ ముక్కలకు ఊపే తోకలు. కృతజ్ఞతా భారంతో కుంగిపోయే వెన్నెముకలు. మాయమైపోతున్న డన్నో .మనిషి లేడు. వీర బెబ్బులి మందలు. వేసవికాలం రాత్రి నైట్ డ్యూటీ నుంచి ఇంటికెళ్తుంటే తారసపడే మందలు. ఇండియాలో ఇంతే ఇండియాలో ఇంతే.

లేకుంటే , పోనీ అమాయకులై ఉండవచ్చా. వందరూపాయల పించనుకే పరమానంద భరితులయే నిరుపేదలై ఉండవచ్చా. క్విడ్ ప్రొ కోలూ ఫెమా ఉల్లంఘనలూ తెలియని నిరక్షరకుక్షులై ఉండొచ్చా. పాపం పేదలురా . వాళ్లననేటందుకు మాటలు రావడం లేదు. అయాం సారీ.

ఇంతకీ ఒపీనియన్ లీడర్లు ఎంతకు అమ్ముడుపోయారు. కులగ్యులాలు ఎంత తిన్నారు. నైతికతా నష్ట్‌హుయీ మానవతా భ్రస్ట్ హుయూ నిర్లజ్జ్యభావ్‌సే బహతీ హో క్యూం.

అరుణ్ సాగర్

అరుణ్ సాగర్ గారు ఎంతో చక్క చెప్పిన విషయాలకి ఏమి సమాధానం ఇవ్వగలం, మన భవిష్యతు మన బిడ్డలా భవిష్యతు పణంగా పెట్టి ఏమి సాధించదళిచామో తెలియచేయ్యల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పైన వుంది. మనం ఎవరికో సమాధానం చెప్పలిసిన పనిలేదు, మనలోని అంతరాత్మకి సమాధానం చెప్పుకుంటే చాలు. ఇలా ఎందుకు అన్నానంటే మనకు మనం  అబధం చెప్పుకున్న రోజున మనం బ్రతికిన ఒకటే.. చచ్చినా ఒకటే..

ఒక్కసరి ఆలోచిస్తారని ఆశిస్తూ మీ హర్ష

Advertisements
Standard
రాజకీయాలు

అరాచకం

మిత్రులకు నమస్కారం,

మాది ఒక చిన్న పల్లెటూరు, నా చిన్నప్పుడు మా ఊరి పొలాల్లోకి ఎటు చూసిన పచ్చటి మాగాణి పొలాలు కనిపించేవి. మాది ప్రకాశం జిల్లా గొప్ప చరిత్ర కలిగిన కృష్ణా డెల్టా చివరి భూములు, అంటే మా తరువాత మిగిలిన నీరు సముద్రంలో కలుస్తాయి అనమాట(అది నేనెప్పుడు చూడలేదు). మాకు నాగార్జునసాగర్ కుడి కలువ నుంచి వచ్చే నీటిని చివరగా వాడుకుంటాము, కొంత భూమి ప్రకాశం బేరేజి కుడి కాలువ నుంచి వచ్చే నీటితో ఒక పంట పండించే భూములు మావి. అది పాతిక సంవస్తరాల క్రిందటి మాట, కాని ఇప్పుడు వచ్చే అరకొర నీటితో ఒకప్పటి మగాని భూముల్లో మెట్ట పంటలు సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నాము.

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2004లో 1/06/2004న విడుదలైన G.O – 53 మరియు 2005లో 11/01/2005న  G.O – 5, 2/03/2005న G.O – 108 జారీ చేసింది ప్రభుత్వం. ఈ G.O లు ఏమిటి ఎందుకు అనుకుంటున్నారా, అది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సంభందించినవి. దీనివల్ల కడపలో లక్షన్నర ఎకరాలు, చిత్తూరులో లక్ష ఎకరాలు మరియు నెల్లూరులో 15వందల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి అని అధికారిక లెక్కలు. ఇంతవరకు అంత బాగానే వుంది. మరి నీరు ఎక్కడనుంచి ఇస్తారు అని చూస్తే శ్రీశైలం డ్యామ్ లో నిండగా వచ్చే నీరుని ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ జిల్లాలకు తరలిస్తారు. అంటే శ్రీశైలం నిండిన తరువాత ఈ ప్రాజెక్ట్ కి పంపాల్సిన నీరు పంపిన తరువాత ఇంకా (కర్ణాటక లోని ప్రాజెక్ట్లు నిండి వారు వదలగా వచ్చే నీరు శ్రీశైలానికి వస్తే) కృష్ణా నది ప్రవహిస్తే అప్పుడు నాగార్జున సాగర్ కి పంపుతారు అనమాట.అది చూసి కృష్ణా డెల్టా వాసులు, తెలంగాణా వాసులు కొంచం కలవరపాటు గురవటం, సర్లే మన సోదరులు కూడా బాగుపడతారు అని కలిగిన బాధని కూడా తట్టుకున్నారు. మరి కృష్ణా డెల్టా ఏమి కావాలి అని ప్రశ్నిస్తే దానికి ఆలు సూలు లేని పోలవరం కట్టి గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పంపుతాం అని చెప్పిన వ్యక్తీని ఒక్క గొంతు మాత్రం వ్యతిరేకించింది, అది దివంగత నేత PJR ది. కాని అప్పటి ముఖ్యమంత్రి (పేరుని పలకటం కూడా మహా పాపం) రాయలసీమ బ్రతకూడదా, మీరు (తెలంగాణా, కోస్తా ఆంధ్ర )మాత్రమే బ్రతకాలా? అని అడిగితే అందరూ నిజమే కాబోలు అని నమ్మి PJR తిట్టిన వారు వున్నారు. పాపం ఆయనకు తెలిసి వ్యతిరేకించారో లేక తెలంగాణాకి నష్టం అని వ్యతిరేకించారో తెలియదు కానీ ఆయన చేసింది అక్షరాల మంచి పని. ఎందుకంటారా? అయితే చదవండి.

కాని నిజం ఏమిటంటే, అప్పటి ముఖ్యమంత్రి కొడుకు యువ అవినీతి చక్రవర్తి గారి నిజ స్వరూప దివ్య దర్సనం మనకు రోజు CBI ద్వారా కలగటం, వాటిల్లో బాగంగా ఒక ఛార్జ్ షీట్లో పేర్కున్న విషయాలు చూసి అప్పటి ముఖ్యమంత్రి, ఆయన పుత్రరత్నం కలిసి ఆడిన జగన్నాటకం తెలిసి దిమ్మ తిరిగి పోయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కట్టింది రాయలసీమని సస్యశామలం చేద్దాం అని కాదు దీని ద్వారా తరలించిన నీరుని తమిళనాడు లోని ఇండియా సిమెంట్ కంపెనీకి పంపటానికి, దానికి ప్రతి ఫలంగా సదరు సిమెంట్ కంపెనీ అయ్యవారి కంపెనీ లో అక్షరాల నూటనలబై కోట్లు(140 కోట్లు) పెట్టుబడి పెట్టింది. అంతర్ రాష్ట్ర జల విధానాలికి తూట్లు పొడిచి మరీ పక్క రాష్ట్రం లోని కంపెనీకి నీలు ఇచ్చారు. మన రాష్ట్ర రైతులు గురించి ఒక్క క్షణం అయిన అలోచిమ్చివుంటే ఇంతటి అఘాయిత్యానికి ఓడికట్టేవారు కాదేమో, మరల వారిది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు ఎందుకంటే రైతులు మాట్లాడారు వారికీ ఏమి తెలియదు అని కాబోలు.ఈ తండ్రి కొడుకులు కలిసి కోస్తా ఆంధ్రా మరియు తెలంగాణా  ప్రజల జీవితాలు పణంగా పెట్టి రాజభోగాలు అనుభవించటానికి సిద్దపడ్డారు. పండించే రైతు మట్టి తినలనామాట  వీరు రాజభోగాలు అనుభావిస్తారనమాట, వీరిని ముక్కలముక్కలాగా నరికినా పాపం లేదు. వీరి బాగుపడటానికి జనాల నోటి కాడ కూడు కూడా లాకుంటారానమాట. చేసిన పాపం ఎక్కడికీ పోదు, అది ఈ జన్మలోనే అనుభవించాలి. అందుకే సగం కాలిన శరీరంతో మూడు రోజులుగా అనాధ శవంలా పడి పురుగులుపడి చాచ్చాడు ఒకడు, వేరేవాడు జైల్లో చిప్పకూడు తింటూ సగం కాలే కడుపుతో శవంలా బ్రతుకుతూ అనుభవిస్తున్నాడు. క్షమించాలి అన్యాయంగా బలైన రైతు కుటుంబాల  కడుపు మంట ఇలానే వుంటుంది.

ఇలాంటివారికి ఈ సమాజంలో ఎలా సానుభూతి లభిస్తుంది, వీరికి ఎలా మాద్ధతు వస్తుంది నాకు అర్ధం కావటం లేదు. వీరికి  మద్దతు ఇస్తే వారి పాపంలో పలుపంచుకున్నట్టే అని నా అభిప్రాయం. కాబట్టి ఈ రాక్షసుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందా.  ఒక్కసారి ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మీ హర్ష.

Standard
రాజకీయాలు

అన్న

అన్న” అనగానే గుర్తుకు వచ్చేది విశ్వ విఖ్యాత నట సార్వభోముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆ పదానికి పూర్తి నిర్వచనం, నిలువెత్తు నిదర్శనం ఆయన. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాసిన ఈ బ్లాగ్ అనివార్య కారణాల వలన ఈ రోజు పోస్ట్ చేయాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ వ్యవస్తాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది జరుపుకునే మహానాడు ఈసారి ఉపఎన్నికలు వలన జరుపుకోలేక పోవటం కొంచెం బాధకరం అయినా, అన్నగారు స్తాపించిన పార్టీకి పునర్వైభవం కొరకు 63 ఏళ్ళ వయసు లోకూడా ఎండనకా వాననకా ప్రజలలో తిరుగుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అబినందనలు తెలుపుతున్నాను.

ఫైన వున్నా చిత్రంలో ఒక ఆసక్తికరమైన విషయం వుంది, తెలుగుదేశం పార్టీని తెలుగు వారి ఆత్మాగౌరవం కాపాడటానికి ఆవిర్భవించినదిగా మన అందరికి తెలిసిన విషయమే. ఒకసారి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి టి.అంజయ్య గారు రాజీవ్ గాంధీకి స్వాగతం పలకటానికి ఇప్పుడు మన పాత బేగంపేట్ విమానాశ్రయంకి వెళ్ళితే, ముఖ్యమంత్రి అనికూడా చూడకుండా కాలుతో తన్నాడు రాజీవ్ గాంధీ. ఆ చర్యతో ప్రతి తెలుగు వాడి గుండె రగిలి ఇచ్చిన తీర్పు ” అన్న గారు స్తాపించిన తెలుగుదేశం పార్టీకి 294 అసంబ్లీ స్థానాలలో 202 తెలుగుదేశం గెలుచి తెలుగువాడి ఆత్మా గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో రెపరెప లాడేలా చేసినది అన్న గారు శ్రీ నందమూరి తారక రామారావు గారు”. అలా తెలుగు వాడి దెబ్బను రుచి చూపించి ఇప్పటికి 30 ఏళ్లు, ఇన్ని ఏళ్ళల్లో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఏ విమానశ్రయంలో అయితే తెలుగు వాడికి అవమానం జరిగిందో అదే విమానాశ్రయానికి ఓ పెద్ద అవినీతి మహా కాంగ్రెస్ నాయకుడు అన్నగారి పేరు తీసి వేసి రాజీవ్ గాంధీ పేరు  పెట్టడం, వారిని మన తెలుగు వారు ప్రోస్తహించడం మన దౌర్భాగ్యం. మన వారు అంతటితో ఆగకుండా రాష్ట్రాన్ని, తెలుగు వారి కీర్తిని నడి బజారులో నిలబెట్టిన ఆ మహా అవినీతి కాంగ్రెస్ నాయకుడి కొడుకు యువ అవినీతి చక్రవర్తిని ప్రోస్తాహించడం నిజంగా తెలుగువారి జీవితాలికి పట్టిన చీడ. ఏనాడో చేసుకున్న పాపం, కర్మ అని అనుకోకుండా ఎవరికీ వారు తమ స్తాయిలో పక్క వారికి విడమరిచి చెప్పటం మన భాద్యత. భాద్యత అని ఎందుకు అన్నానంటే ఇప్పటి రాష్ట్ర పరిస్థితుల్లో మంచి రాజకీయ పార్టీకి తోడ్పాటుగా వుంటే మన భావితరాలకు ఒక మంచి సమాజాన్ని నిర్మించి ఇచ్చిన వారమౌతాము లేక పోతే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భాద్యతారాహిత్యంగా నిలబడాల్సి వస్తుంది.

అందరూ ఒక్కసారి అలోచించి, ఏ పార్టీ హయంలో ఈ రాష్ట్రం బాగు పడిందో గుర్తుకు తెచ్చుకొని అ పార్టీకి మద్దత్తు తెలుపుతారని ఆశిస్తూ మీ హర్ష.

Standard