రాజకీయాలు

తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ, జూ.ఎన్టిఆర్ సహాయ పడగలరా?

తెలుగుదేశం పార్టీకి వీరిరువురు ఎంతవరకు సహాయపడగలరు అనే విషయం పైన నాకంటే సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు శ్రీ రాధా కృష్ణ గారి రాసింది అక్షరాల నిజం అనిపించి మీ కోసం ఇక్కడ వుంచటం జరిగింది. చదవగాలిగేవారు చదవండి, చూడగాలిగేవారు చూడండి.

ఓపిక లేక పోతే కనండి.

ఇప్పుడు మీరు చెప్పండి, వీరు సహాయం చేస్తారా లేక తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకు, అభిమానులకు మరియు కార్యకర్తలకు ద్రోహం చేయాలనుకుంటున్నారా?

Advertisements
Standard
జనరల్

అమ్మ

“అమ్మ” అనే పదానికి అర్ధం చెప్పటం చాల కష్టం, ఏదో ఒక  నిర్వచనం చెప్పి అ పదానికి వుండే విలవను తగ్గించలేను. నా దృష్టిలో అమ్మ లేనిది ఏమి లేదు, అంటే ఒక వ్యక్తి ఏదైనా సాదిస్తే దానికి కర్త, క్రియ, కర్మ అన్నీ అమ్మే అని నా వుద్దేశం ఎందుకంటే ఆమె లేనిది ఆ బిడ్డ లేడు, ఆ బిడ్డ లేనిది ఆ పని లేదు, ఆ పని లేనిది ఆ ప్రతిష్ట లేదు అని నమ్మే వాడిని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నెల 13వ తారీకున మదర్స్ డే అని వినగానే, నా మదిలో మేలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని వ్రాయటం మొదలు పెట్టాను.

మన భారతీయ సంస్కృతీ ఆధారంగా మనము తల్లితండ్రులను గౌరవించటం సంప్రదాయం. మన జీవిత కాలము వారికి ఒక ప్రత్యేక స్తానాన్ని కల్పిస్తాము. పాశ్చాత్య దేశాలలో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపించదు కాబట్టి సమజంలో విలువలు కాపాడుకోవటానికి ఒక రోజును వారు ఇలా ఒక పండుగ లాగా జరుపుకుంటారు. కొత్త ఒక వింత పాత ఒక రోత కాబట్టి మన వాళ్ళు ఈ రోజుని ప్రత్యేక దినంగా పరిగణించటం మొదలు పెట్టారు. అది మన కర్మ అయినా నేటి సమాజ పోకడలో ఇది ఒకందుకు మంచిదే అనుకుంటున్నాను. కనీసం ఈ ఒక్క రోజైన తల్లిని పట్టించుకోని ప్రభుద్దులకు మదిలో తల్లి జ్ఞాపకాలు రాక మానవు, ఎందుకంటే ఆమె పంచిన ప్రేమ అలాంటిది కాబట్టి. మనము ఈ రోజున అమ్మకు ఏదో ఒక బహుమతిని తీసుకు వెళ్ళాల్సిన పని లేదు, కనీసం ఆమెను ప్రేమగా పలకరించనా ఆ తల్లి మనసులో వెలకట్టలేని ప్రేమను మీరు ఆమె కళ్ళల్లో చూడగలరు. అది మనకు కొండంత బలాన్ని ఇస్తుంది, దేన్నైనా సాదించ గల నమ్మకాన్ని ఇస్తుంది, ఏంతో ఎత్తుకు ఎదిగేల ప్రోత్సహిస్తుంది. అందుకే అంటున్నాను మీరు ఎంత ఎత్తుకు ఎదిగిన దానికి ముఖ్య కారణం మీ తల్లి అని మరిచిపోవోద్దు. మరిచిపోయి మన జీవితాన్ని, సంస్కృతిని నాసనం చేసుకోవోద్దు అని నా మనవి.

“అమ్మ”, ఆమె ఎప్పుడు వెనకే వుంటుంది కాబట్టి మనకు ఒక పేరును పెట్టి సమాజంలో ముందుకు నడిపించినా, మన మనసులో మాత్రం ఎప్పుడూ ముందు వుంటుంది కాబట్టి మన ఈ జీవితానికి ఒక పేరును చెప్పమంటే అది “అమ్మ” అని చెప్తాను. ఆ పేరు వెనుక వుండే ఒక జీవానికి కారణం ఆమె కాబట్టి, ఆమె మనకందించిన ప్రేమలో ఒకటో వొంతు పంచినా ఎనలేని ఆనందంతో పొంగిపోయే ఆ పిచి ప్రేమను అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ నా ఈ జీవితాన్ని ప్రసాదించి, అన్ని వేళలా నా వెన్నంటి నిలిచిన, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి నేను ఎన్ని తప్పులు చేసిన క్షమిస్తూ తను మాత్రమే బాధ పడుతూ నాకు వెలకట్టలేని తన ప్రేమను మాత్రమే పంచిన  నా తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటూ మీ హర్ష.

Standard
జనరల్

కాపాడుకుందాం, చిన్న పిల్లల్ని

నా తెలుగింటి ప్రజలకు నమస్కారం,

మన భారతీయ సంస్కృతిలో చిన్న పిల్లల్ని దేవుడితొ పోలుస్తారు, ఇక్కడ దేవుడు అంటే నిష్కకల్మషమైన మనుసుతో వుండే వారని. వారికీ కులం, మతం, జాతి అనే భావన వుండదు కావున వారిని దగ్గరకు తీసుకొని ముద్దాడని వారు వుండరు (ఒక్క రాజకీయ నాయకులు తప్పించి ఎందుకంటే వారికి ఓటు హక్కు వుండదు కాబట్టి). అటువంటి చిన్నారులు చికిత్సతొ నయం చేయగలిగే జబ్బుల బారిన పడి చనిపోవటం అనేది ఏంతో దారుణమైన విషయం, దీనిని అందరు ముక్తఖంటంతొ ఖండించాల్సిన విషయం. ప్రపంచ మొత్తంలో 80 లక్షల మంది చిన్నారులు ఈ నిర్లక్ష్యంతో చనిపోతుంటే అందులో మన భారతదేశంలో చనిపోయే చిన్నపిల్లల సంఖ్య 20 లక్షలు, వీరి వయసు 5 సంవత్సరాలు మించి లేక పోవటం కదిలించి వేసే విషయం. వీరిలో చాల మందికి ఒక్క గ్లాసు మంచి నీరు అందించి రోగాల బారిన పడకుండా బ్రతికించవచ్చు. అంటే చాలామందికి స్వచమైన త్రాగే నీరు లేక చనిపోవటం అనేది చాల తీవ్రమైన విషయం. త్రాగే నీరు లేక అల్లడేది ఎక్కువగా మనకు మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు కనిపిస్తాయి. వీరి గోడు పట్టించుకొనే నాడుదు ఎవ్వడూ లేడని సాక్షాత్తు మన కేంద్ర మంత్రి వోప్పుకోవటం మన దౌర్భాగ్యం. ప్రతి భారతీయుడుకి ఈ భారత దేశంలో జీవించే హక్కు ఎలా వుంటదో, అలాగే ఎక్కడ జన్మించే ఈ చిన్నారులు బ్రతికే హక్కు లేదా? అదీ గుక్కెడు మంచి నీరుతో…

వారికి మంచి నీరు అందిచలేని ఈ ప్రభుత్వాలకు కట్టిన పన్నులు ఏమవుతున్నట్టు. వీటిని రాజకీయ నాయకులు భోంచేస్తుంటే మనం పన్నులు ఎందుకు కట్టాలి, ఎందుకు వుపేక్షించాలి. అందుకే మనమే వారికి చేయుతనిద్దాం, నిస్వార్దంగా సేవ చేసే సంస్థలకు మనము ఆర్దిక సహాయం చేస్తే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మన డబ్బు మంచి పనికి
వుపయోగించామన్న తృప్తి ఉంటుంది. కనీస మొత్తం ౩౦౦ రూపాయలు ఈ “savethechildren” సంస్థకి చందా ఇస్తే వారు ఈ 20 లక్షల మంది చిన్నారులను
కాపాడటానికి వుపయోగిస్తారు. వీరు గత సంవత్సరం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని 65 వేల మంది చిన్నారులకు చేయూత నిస్తున్నారు అలాగే భారత దేశంలో 4 లక్షల మంది చిన్నారులని కాపాడుతుంది. మీకు ఎంత వీలుయితే అంత చందా ఇవ్వొచ్చు. దానికి చేయవలసిందల్ల 022-42727272 నెంబర్ కి ఫోన్ చేయటం, లేక పోతే http://www.savethechildren.in వెబ్ సైట్ కి పింగ్ చేయండి.

అడిగితే దులుపుకు పోయే రాజకీయ నాయకులున్నఈ సమాజంలో వారికీ గుక్కెడు మంచి నీరు అందిచలేని ఈ ప్రభుత్వాల్ని నిందించటం కన్నా వీరిని కాపాడుకోవటం మన భాధ్యత కాబట్టి ఎవరికి వారు కార్యోన్ముకులైతే మంచిదని నా అభిప్రాయం.

ఈ చిన్నారులు బ్రతకటానికి ఒక్క చివరి అవకాసం ఇవ్వాలని, అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ హర్ష

Standard
రాజకీయాలు

కాంగ్రెస్ భస్మాసుర హస్తం

Image

ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావొస్తుంది. గతించిన, మనల్నీ గతించటానికి వస్తున్న యువ నేత హయంలో జరిగిన అవినీతిలో భాగంగా వేలిసిన ఈ పార్క్ హయత్ హోటల్ ప్రారంభోత్సవం సందర్బంగా ఫై ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులు తమ భస్మాసుర హస్తాలతో ప్రారంభించటం, యద్రుచికంగానే అయినా సమయం సందర్భం చక్కగా కుదరటం నాకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది.

మన రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు వున్నప్పుడు ఇంత అనిశ్చితి, శూన్యత ఎప్పుడు కానరాలేదు. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ని ఇంటికి పంపించివేస్తేగాని మనము భాగుపడమని అర్ధమైతే మంచిదని నా అభిప్రాయం. అలాగని వీరిని పంపించి యువ అవినీతి మహా చక్రవర్తికి రాష్ట్రాన్ని అప్పగించితే మన పరిస్తితి  పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కాబట్టి మీరు అలోచించి తీసుకునే నిర్ణయం, మీకు, మీతోటి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలను ప్రసాదించినవారవుతారు.

నా తోటి తెలుగు వారందరూ అలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ, మీ హర్ష.

Standard