రాజకీయాలు

నాయకుడు – నాయకత్వం అంటే?

నేను ఈ మధ్య నాయకుడు – నాయకత్వం అనే పాదాలకు అర్ధం కోసం కొంత పరిశోదన చేయగా నాకు అర్ధం అయినది ఏమనగా
“నాయకుడు అనగా పరిపాలనాదక్షుడు, సన్మార్గం లో నడిపేవాడు, ప్రభావితం చేయగలవాడు” అని.
“నాయకత్వం అనగా తనతోటి నడిచేవారిని మంచి పనులు చేయటానికి ప్రభావితం చేయటం, మంచి మనిషిగా జీవించేలా చేయటం, కష్టపడి పనిచేసి గమ్యాన్ని చేరేలా ఉత్తేజ పరచటం” అని.

ఇప్పుడు ఈ విషయ ప్రస్తావనకు ముక్య కారణం, ఈ మధ్య ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అవినీతిలో కూరుకు పోయిన వ్యక్తి ఓక పార్టీ స్థాపించడం దానికి కొంతమంది తమకు తాముగా నాయకులగా భావించుకొని రాష్ట్రంలో కొత్తగా పుట్టిన ఆ పార్టీకి మద్దతు తెలపుతుంటే ఆశ్చర్యంగా విడ్డురం అనిపించింది. అతనొక అవినీతి చక్రవర్తి అని తెలుసు, ఎందుకు పార్టీ స్థాపించాడో తెలుసు, అన్నీతెలిసి అతనికి మద్దతు ఎలా తెలుపుతున్నారో అర్ధం కాక, ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకొని అతని చూపిన మార్గంలో నడవటానికి మనము చూసే కొలమానం ఏమిటో తెలియక అసలు నాయకుడు అంటే నాయకత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలనిపించింది.ఈ సమయం లో నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి, అవి ఏమిటంటే ఆ అవినీతి చక్రవర్తి గారి సభలకు జనాలు రావటం చూసి వీరందరి ఓట్లతో కొందరు అనామకులు, నాయకులుగా చలామణి అవటానికి రంగం సిద్దం చేసుకున్నారు. వారు ఎవరంటే…

1. తమని తాము నాయకులుగా భావించుకొని వారు నిజంగా నాయకులూగా మారిపోవోచ్చనే ఆశతో వెళ్ళేవారు కొంత మంది.
2. వున్న అధికారాన్ని మరియు ఆయన గారి అవినీతిలో పాలుపంచుకొని సంపాదించినదాన్నినిలుపుకోవటానికి వెళ్ళేవారు కొంత మంది.(అధికార పార్టీ మహా ప్రభుద్దులు వీరు)
3. ఇప్పుడున్న పార్టీలలో నాయకత్వాన్ని వెతిరేకిన్చేవారు కొంతమంది (అన్నీ పార్టీలలోని వారు)
4. ఆ మహాశయుడిలగానే రాత్రికి రాత్రి డబ్బు సంపాదించాలనే వారు కొందరు.

ఇలాంటి వారు మన మధ్యలోనే వుంటారు, వారికీ మద్దతు ఇచ్చి నాయకులుగా మార్చే వారు ఎవరో కాదు – అది             “ప్రజలు అలియాస్ జనాలు”.

ఇంతకీ ఎవరీ జనాలు, ఎందుకు అయన గారి సభలకి వస్తున్నారు, ఎందుకు అయన పార్టికి ఓట్లు వేస్తున్నారు అని చూస్తే ఆశ్చర్యకరమైన రెండు విషయాలు తెలిసినవి, ఒకటి కులం రెండు మతం.                                                                         1. సాదారణంగానే ప్రతి మనిషిలోనూ అతని కులంపైన సానుభూతి వుంటుంది అది సమయం సందర్భాన్ని బట్టి, అతని విగ్నతని బట్టి బయటకు వస్తుంది. ఈ అవినీతి చక్రవర్తి తన తండ్రి గారి హయాంలో చేసిన కుల రాజకీయాలు వల్ల రెడ్డి కులస్తులు అందరూ అని చెప్పలేను కాని అధికంగానే తమ మద్దతు తెలుపుతున్నారు, అది సహజం, అది వారి విగ్నతికి వదిలివేయడం మంచిది. ఎందుకంటే నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు బాగా చదువుకున్న వారు విజ్ఞత కలిగిన వారు, అందునా రెడ్డి కులస్తులు. వీరిరువురు చదువుకొనే రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివ్రుధిని చూసి, చంద్రబాబు గారిని అభిమానించేవారు. కానీ ఎప్పుడు అదే వారిరువురు ఈ అవినీతి చక్రవర్తికి మద్దతు తెలుపటంతోటి నోరు వేల్లబెట్టుకోవటం మన వొంతైంది. దీనికి వారు చెప్పే భాష్యం “మీరు (అనగా మనము) మా యువ అవినీతి చక్రవర్తికి రెడ్డి అనే కులం కార్డు  ఎందుకు అంటిస్తారు”. హతవిధీ…..నాకు ఏమి చెప్పాలో అర్ధం కాక నేను వారిని అడిగిన ప్రశ్న “మీరు అంటించుకున్నారా లేక  మేము అంటించామా?”  – మీరే చెప్పండి.                                        2.ఈ రెడ్డి గారి హయాంలో కొన్ని క్రైస్తవ సంస్థల్ని నాసనం చేసి తన అల్లుడు గారు అయిన బ్రదర్ అనీల్ గారి సంస్థకి ఆ మతం యొక్క నిదులను మళ్లించి అది ఎన్నికల వేల తన పేరు మీద వారికీ పంచిన ఘనుడు. ఇంతటి ఘన కార్యం చేసినందుకు బలహీన వర్గాలుగా పిలుచుకొనే ఆ వర్గం యువ అవినీతి చక్రవర్తికి మద్దతు తెలపటం శోచనీయం అయిన అంగీకరించక తప్పదు. రాష్ట్ర జనాభాలో వీరి సంఖ్యా బలం ఎక్కువ కావటం వలన మన అనామక నాయక గణానికి ఆశలు చిగురించి అందరూ ఆ అవినీతి చక్రవర్తికి జై అంటున్నారు. మరి హిందూ మతాన్ని ఆసరాగా చేసుకొని పుట్టిన భాజపాని దూరంగా వుంచే మన నాయకులూ, పార్టీలు, ప్రజలు మరి క్రైస్తవ మతాన్ని ఆసరాగా వచ్చిన ఈ పార్టీని ఎందుకు దూరంగా పెట్టరు?  మీరన్నాఅలోచించి చెప్పండి.

ఇప్పుడు చెప్పండి ఈ అనామక నాయకులు నిజమైన నాయకులుగా మారి వచ్చినా, వారికి నాయకత్వ పటిమ వుంటుందా? వీరిని గెలిపించి ఏమి బావుకోవాలి మనము. ఒక్కసారి ఆలోచించండి…. నా ప్రియమైన ప్రజలు అలియస్ జనాలు.

Advertisements
Standard
రాజకీయాలు

ఆత్మగౌరవం

The Legend

ఆత్మగౌరవం” అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది “అన్న గారు“, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామా రావు గారు. తెలుగు భాషలో బ్లాగ్ వ్రాస్తూ అన్న గారికి అభివందనం తెలుపకుండా వ్రాయటం నావల్లైతే కాదు. ఆ మహా పురుషునికి నా నిండు హృదయంతో శతకోటి వందనాలు.

నాకు తెలుసు పైన చదివిన వెంటనే నాకు కులం అనే కార్డు అంటిస్తారని, అది మీ విజ్ఞత, అయిన కాని ఆ మహా పురుషుడిని కొలవకుండా నేను ఈ పనిని మొదలు పెట్టలేను. తెలుగు వాడి కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింప చేసి ప్రతి తెలుగు వాడు తల ఎత్తుకుని తిరిగేల చేసినది ముమ్మాటికి అన్న గారు శ్రీ నందమూరి తారక రామా రావు గారు మాత్రమే. అందుకే ఆయన అన్నా , ఆయన సినిమాలన్న , ఆయన స్తాపించిన తెలుగు దేశం పార్టీ అన్నా అంత అభిమానం.

మంచి ఎక్కడున్నా గ్రహించడం మన సంప్రదాయం లో ఒక బాగం కాబట్టే ఈ భారత దేశంలో ఎక్కడ లేనన్ని జాతులు, కులాలు, మతాలూ కలిసి సహా జీవనం సాగించగలుగుచున్నాయి. అందుకే కాబోలు అన్న గారు తెలుగు వాడి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసే ఏ పనినైన నిండు మనసుతో తన మద్దతు తెలుపుతూ వచ్చారు. పి.వి.నరసింహ రావు గారు తన పార్టీ కాదు, ప్రాంతం కాదు, కులం కాక పోయిన ఒక తెలుగు వాడు ప్రధాన మంత్రి కావటం తెలుగు వారికి కీర్తి కాబట్టి పోటి నిలపకుండా తన పూర్తీ మద్దత్తు తెలిపారు. అలాగే ఆయనను అభిమానించే వారు అయన లోని మంచిని కొంతైన ఆచరించ గలిగిననాడు, వారు నిజమైన అభిమానులుగా పిలవబడతారనేది నా నమ్మకం. అయనలాగే అయన అభిమానులు కూడా పార్టీ, ప్రాంతం, కులం అని చూడకుండా మంచిని ప్రోత్సహిస్తారు. అందువల్లే ఆంధ్రదేశ చరిత్రలో ఇప్పటివరకు తెలుగు వారికీ ఎంతో కొంత మంచి జరిగింది అంటే అది అన్న గారు స్తాపించిన తెలుగుదేశం పార్టీ హయం లోనే అనేది యాద్రుచికం అయిన నమ్మక తప్పదు, ఎందుకంటే చింపితే చిరిగి పోవటానికి అంది పేపర్ కాదు చరిత్ర. అది నగ్న సత్యం.

Standard
జనరల్

నమస్తే… స్వాగతం

నాకు మన మాతృ బాష అయిన తెలుగు ఫై వున్న మక్కువ మరియు గౌరవం తోటి నేను ఈ బ్లాగ్ తెలుగులోనే వ్రాయాలని నిశ్చయించుకున్నాను.

నా ఈ బ్లాగ్ వ్రాయటానికి ముక్య కారకులైన నా తల్లి తండ్రులకు మరియు గూగుల్ వారికీ నా కృతఙ్ఞతలు.

ఈ బ్లాగ్ కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలూ మాత్రమే, ఎవ్వరిని నొప్పించటానికి, వుద్దేసించినవి కావు.

 హర్ష కొడాలి 

Standard